దూలపల్లి PACS కు ISO & HYM సర్టిఫికేషన్. అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్

దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) ISO & HYM సర్టిఫికేషన్ అందుకున్న సందర్భంగా ఎమ్మెల్యే ని వారి క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దూలపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) 5 ఏళ్లుగా ప్రజాప్రయోజనాలకే కట్టుబడి, ఉత్తమ పాలనతో నిరంతరంగా సేవలందించడంతో, ISO 9001:2015 మరియు HYM ఇంటర్నేషనల్ సర్టిఫికేషన్ ను అందుకోవడం గర్వకారణమని ఎమ్మెల్యే శ్రీ కె.పి.వివేకానంద్ పేర్కొన్నారు. 1960లో స్థాపితమైన ఈ బ్యాంక్, గత 5 సంవత్సరాల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. 2019లో రూ.24.85 కోట్ల డిపాజిట్లు ఉండగా, 2024 నాటికి ఇవి రూ.56.82 కోట్లకు పెరిగాయి. అప్పుల జారీ రూ.21.22 కోట్ల నుంచి రూ.32.26 కోట్లకు, ఆస్తుల విలువ రూ.2.9 కోట్ల నుంచి రూ.9.97 కోట్లకు, లాభాలు రూ.53 లక్షల నుంచి రూ.1.25 కోట్లకు పెరిగినట్లు తెలిపారు. ఈ బ్యాంక్‌కు చెందిన రెండు భవనాలు మరియు ఐదు గోదాముల ద్వారా వార్షికంగా రూ.1.53 కోట్ల అద్దె ఆదాయం లభిస్తోంది. ఈ భవనాలు నాబార్డ్ నుండి రుణంగా పొందిన నిధులతో నిర్మించబడ్డాయి. ప్రస్తుతం బ్యాంక్ నెలకు రూ.1.19 లక్షల EMI చెల్లిస్తోంది. ప్యాక్స్ నిర్వహణ వ్యవస్థ రైతులకు మరియు ఖాతాదారులకు ప్రయోజనకరంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తోందని ఎమ్మెల్యే గారు ప్రశంసించారు. ఈ బ్యాంక్ అభివృద్ధి ఇతర ప్యాక్స్‌కు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా PACS అధ్యక్షుడు శ్రీ నరేంద్ర రాజు గారు, వైస్ చైర్మన్ శ్రీ రవీందర్ రెడ్డి గారు, డైరెక్టర్లు శ్రీ సిహెచ్ మధుసూదన్ గారు, పి. మల్లేష్ గారు, జి. కృష్ణ యాదవ్ గారు, డి. నరేందర్ గారు, బి. మధుసూదన్ గారు, ఎం. మదన్ రావు గారు, ఏ. సత్యనారాయణ గారు, సీఈవో శ్రీ కృష్ణ గారు, మరియు ఇతర మేనేజ్మెంట్ సభ్యులు పాల్గొన్నారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy