మల్కాజిగిరిలో మేవెన్ సిలికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ప్రారంభం.|

0
142

"సెమీకండక్టర్ రంగంలో యువతకు అంతర్జాతీయ అవకాశాలు కల్పించే దిశగా ముందడుగు"

మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 4: భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యానికి మరో కీలక అడుగు పడింది. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ప్రముఖ వీఎల్‌ఎస్‌ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ శిక్షణా సంస్థ మేవెన్ సిలికాన్ అత్యాధునిక 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ను మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 17 ఏళ్లుగా బెంగళూరులో సెమీకండక్టర్ రంగానికి నాణ్యమైన ఇంజనీర్లను అందిస్తున్న మేవెన్ సిలికాన్ హైదరాబాద్‌లో కార్యకలాపాలు ప్రారంభించడం సంతోషకరమన్నారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక ఇంజనీరింగ్ విద్యార్థులు, యువతకు అంతర్జాతీయ స్థాయి శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్ మిషన్ (ISM) ద్వారా దేశంలో చిప్ డిజైన్, తయారీ రంగాల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తోందని ఈటల రాజేందర్ పేర్కొన్నారు.

సెమీకండక్టర్ రంగంలో దేశీయ సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఇలాంటి శిక్షణా కేంద్రాలు కీలక పాత్ర పోషిస్తాయని, భారత యువతను ప్రపంచ స్థాయి సాంకేతిక నిపుణులుగా తీర్చిదిద్దడంలో మేవెన్ సిలికాన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ముఖ్యమైన వేదికగా నిలుస్తుందని ఆయన అన్నారు.

#Sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
Voter survey
తెలంగాణలో నేటి నుంచి ఇంటింటి ఓటరు సర్వే ప్రారంభం   తెలంగాణలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ...
By G k Nookala 2026-06-25 07:10:53 0 172
Andhra Pradesh
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో ఈరోజు 2026 క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగినది
చీరాల రూరల్ అధ్యక్షుడు బక్కా మనోహర్ రెడ్డి అధ్యక్షతన భారతీయ జనతా పార్టీ చీరాల కార్యాలయంలో...
By Gadiyapudi Narendra 2026-01-09 15:57:39 0 510
Andhra Pradesh
మెడికల్ కాలేజీకి డబ్బుల్లేవు ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు 1750 కోట్లు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి అంట
ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయడానికి నిధులు లేవంట...! కానీ ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటు...
By Rajini Kumari 2026-01-13 16:06:03 0 238
Andhra Pradesh
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడ
చందర్లపాడు గ్రామంలో 8వ పోషణ పక్వాడా ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం చందర్లపాడుగ్రామం లో...
By Patan Khuddus 2026-04-18 16:15:13 0 807
Telangana
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మార్కెఫెడ్ డీఎం
రామాయంపేట మండల కేంద్రంలోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్ఫెడ్ డీఎం సునీత సందర్శించారు. కొనుగోలు...
By Katiyala JeevanRaj 2026-04-18 11:17:24 0 461
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com