* జర్నలిస్టుపై వేధింపులు ఖండించండి..* ప్రజా సంఘాల పిలుపు..*
*జర్నలిస్టులపై వేధింపులు ఖండించండి..*
- *ప్రజా సంఘాల పిలుపు..*
*ఒంగోలు//కలం తీర్పు: ఫిబ్రవరి 2:* ప్రజాస్వామిక జర్నలిస్టులపై వేధింపులను రాజ్యాంగబద్ధంగా ఖండించాలని, ప్రజలు ప్రజాస్వామిక వాదులు వారికి అండగా నిలవాలని పలువురు ప్రజా సంఘాల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒంగోలు అంబేద్కర్ భవనంలో డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం- ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో' జర్నలిస్టులపై వేధింపులను నిరసిస్తూ ప్రజాసంఘాల సమన్వయంతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.సమావేశానికి డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం గౌరవ సలహాదారులు,న్యాయవాది డాక్టర్ నూకతోటి రవికుమార్ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ దేశంలో ఈ పదేళ్ల కాలంలో 20 మందికి పైగా జర్నలిస్టులను హత్య చేశారని, 150 మందికి పైగా జర్నలిస్టులపై అక్రమ కేసులు నమోదు చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.ఈ సమావేశంలో హైకోర్టు న్యాయవాది షేక్ కరీముల్లా, న్యాయవాది మన్నం సుధీర్, రైతు సంఘం నాయకులు చండూరి రంగారావు, ఓపిడిఆర్ అధ్యక్షుడు చావలసిన సుధాకర్, ఏఐ బిఎస్పీ ప్రతినిధి ధరణికోట లక్ష్మీనారాయణ బి వై సి జిల్లా అధ్యక్షుడు విరీయం శ్రీనివాస్,మాల జేఏసీ కొండలు, వి కే సి జిల్లా పార్టీ అధ్యక్షుడు ఆదినారాయణ, సోషల్ డెమొక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా సెక్రెటరీ అబ్దుల్ సత్తార్, అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బొట్ల తదితరులు ప్రసంగిస్తూ రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను బతికిస్తున్న జర్నలిస్టులకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు.ఈ సందర్భంగా తొలుత, మైనింగ్, ఇసుక మాఫియా చేసిన హత్యల కారణంగా చనిపోయిన జర్నలిస్టులకు నివాళులర్పిస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత కత్తి కళ్యాణ్ సంపాదకత్వంలో ప్రచురిస్తున్న' మన కాలం' మాసపత్రికను ఆవిష్కరించారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో. కాంగ్రెస్.ఎస్సీ సెల్ అధ్యక్షుడు ప్రసన్న రాజు,ఉద్యోగుల ఐక్యవేదిక తుల్లిబిల్లి అశోక్, విద్యార్థి సంఘ జేఏసీ అధ్యక్షుడు రాయపాటి జగదీష్, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు తోరటి ఆనంద మాదిగ, రచయితల సంఘ అధ్యక్షుడు ఏజ్రా శాస్త్రి,.వాజా రాష్ట్ర అధ్యక్షుడు గుండా మల్లికార్జున్రెడ్డి,న్యూస్ 99 బ్యూరో స్టాలిన్ బాబు, జర్నలిస్టులు గురుకంత చారి,నాగార్జున్ రెడ్డి, కళాంజలి సుబ్బారావు, వజ్రాయుధం రామకృష్ణ, గద్దల శివాజీ,రత్నం,నూకతోటి శరత్ బాబు, బెంజిమెన్,సంజీవరావు, కాలేషా వలి, రజని,కవి మధుర శ్రీ, డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫోరం కన్వీనర్ బొడ్డు శ్రీనివాసరావు,ఎగ్జిక్యూటివ్ సభ్యులు షేక్ నాసిర్ అహ్మద్, పాలపర్తి సతీష్,తెలగతోటి భరత్ కుమార్, పైనం సురేంద్ర, యోన,సంతోష్,జాన్ బాబు,సూరజ్,సురేంద్ర,మురళి, ప్రకాశం జిల్లా కిసాన్ మోర్చా వేముల మోజేష్, రాజారావు, కరిముల్ల, తదితరులు పాల్గొన్నారు.
- Goa
- Jammu & Kashmir
- Punjab
- Uttar Pradesh
- Uttarkhand
- Andaman & Nikobar Islands
- Andhra Pradesh
- Karnataka
- Kerala
- Lakshdweep
- Puducherry
- Tamilnadu
- Telangana
- Dadra &Nager Haveli, Daman &Diu
- Himachal Pradesh
- Gujarat
- Madhya Pradesh
- Maharashtra
- Rajasthan
- Legal
- Life Style
- Music
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- Education
- International
- Haryana
- BMA
- Bharat
- Business
- Entertainment
- Fashion & Beauty
- Health & Fitness
- Arunachal Pradesh
- Assam
- Bihar
- Chhattisgarh
- Jharkhand
- Ladakh
- Manipur
- Meghalaya
- Mizoram
- Nagaland
- Odisha
- Sikkim
- Tripura
- West Bengal
- Chandigarh
- Delhi - NCR
- Bharat Aawaz
- IINNSIDE
- Business EDGE
- Media Academy