Nara Bhuvaneswari: నారా భువనేశ్వరి టీమ్ ను అభినందించిన సీఎం చంద్రబాబు.

0
220

ఎన్టీఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్న సీఎం చంద్రబాబు

 

ట్రస్ట్ 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఎక్స్ వేదికగా స్పందించిన చంద్రబాబు

తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంస

తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నిరంతరం పోరాడిన మహనీయుడు నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేలా ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ట్రస్ట్ స్థాపించి 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా స్పందిస్తూ ఎన్టీఆర్ ట్రస్ట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. 

 

అధికారం అంటే పేదల సేవ అనే భావనతో ప్రజా సేవకు నిజమైన అర్థాన్ని ఇచ్చిన ఎన్టీఆర్ గారి బాటలో ట్రస్ట్ సేవలు కొనసాగిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు. విద్య, వైద్యం, రక్తదానం, విపత్తుల్లో సహాయం వంటి కార్యక్రమాల ద్వారా ట్రస్ట్ సమాజంలో తిరుగులేని ముద్ర వేసిందన్నారు. ముఖ్యంగా తలసేమియా వ్యాధిగ్రస్త చిన్నారులకు నిరంతర సేవలు అందించడంలో ఎన్టీఆర్ ట్రస్ట్ చేస్తున్న సేవలు అసామాన్యమని ప్రశంసించారు. అలాగే మహిళా సాధికారత, జీవనోపాధి కల్పనలోనూ ట్రస్ట్ కీలక సేవలు అందిస్తోందని తెలిపారు. 

 

ట్రస్ట్ సేవలను మరింత విస్తరిస్తూ సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్తున్న ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి, వారి బృందాన్ని చంద్రబాబు అభినందించారు. ట్రస్ట్ కార్యక్రమాలకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఇలాగే కొనసాగుతూ కోట్ల మందికి అండగా నిలవాలని ఆకాంక్షించారు.

Search
Categories
Read More
SURAKSHA
S. Krishna Aditya, IAS: Driving Telangana's Progress
A Young Reformer Transforming Governance, Education, and Public Administration with Innovation,...
By Lokeshwari Panthadi 2026-07-15 04:39:37 0 145
Andhra Pradesh
టమోటా మార్కెట్లలో అక్రమాలకు చెక్.. జేసీ ఆదేశాలు.
అన్నమయ్య జిల్లాలో టమోటా మార్కెట్ యార్డుల్లో అక్రమాలకు తావులేకుండా కట్టుదిట్టమైన చర్యలు...
By Pagadala Venkateswar 2026-04-27 05:39:25 0 120
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:00 0 80
Telangana
అకాల వర్షానికి నేలమట్టమైన వరి పంట
రామయంపేట మండలం వెంకటాపూర్లో గత రాత్రి కురిసిన అకాల వర్షం, ఈదురుగాలులకు కోతకు వచ్చిన వరి పంట...
By Katiyala JeevanRaj 2026-05-06 10:03:31 0 380
Telangana
జ్యువలరీ షాప్ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్న సీనినటి రితికా నాయక్, మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నస్పూర్ పట్టణ లో నూతనంగా ఏర్పాటు REYVION GEMS &...
By Avunoori Mahesh 2026-09-01 12:17:33 0 152
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com