ఐహెచ్ఆర్సి జెనీవా జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా న్యాయవాది రాజేశ్వరి

0
243

చీరాల:  అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్  ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఇండియన్ నేషనల్ చాప్టర్‌కు జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా చీరాలకి చెందిన న్యాయవాది రాజేశ్వరి చేబ్రోలును నియమించారు. ఈ మేరకు ఐ హెచ్ ఆర్ సి జెనీవా భారత జాతీయ అధ్యక్షుడు,అంతర్జాతీయ రాయబారి డాక్టర్ కె. రాజానందన్ విజ్ఞాన్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఐక్యరాజ్యసమితి ఆర్థిక మరియు సామాజిక మండలి తో సంప్రదింపుల హోదా కలిగి ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల హై కమిషనర్ కార్యాలయం తో అనుబంధంగా పనిచేస్తున్న ఐ హెచ్ ఆర్ సి,జెనీవా మానవ హక్కుల పరిరక్షణ, శాంతి ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్న ప్రపంచవ్యాప్త సంస్థగా గుర్తింపు పొందింది.
రాజేశ్వరి చేబ్రోలు నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని, ఆమె పదవీకాలం రెండేళ్లుగా ఉంటుందని పనితీరు సంతృప్తికరంగా ఉంటే పునరుద్ధరణకు అవకాశం ఉంటుందని తెలిపారు. జాతీయ ఆర్గనైజింగ్ కార్యదర్శిగా ఆమె జాతీయ, ప్రాంతీయ సమావేశాలు, సెమినార్లు, వర్క్‌షాప్‌లు, ఈవెంట్ల నిర్వహణ, లాజిస్టిక్స్ సమన్వయం, రాష్ట్ర కమిటీలు,అంతర్జాతీయ భాగస్వాములతో అనుసంధానం వంటి కీలక బాధ్యతలు నిర్వహించనున్నారు.అలాగే ఈవెంట్ల డాక్యుమెంటేషన్, నివేదికల తయారీతో పాటు జాతీయ అధ్యక్షుడు, జాతీయ కార్యదర్శి అప్పగించే ఇతర విధులను కూడా నిర్వర్తించనున్నారు.
ఈ సందర్భంగా ఐ హెచ్ ఆర్ సి జెనీవా ఆమె నియామకానికి అభినందనలు తెలియజేసింది.మానవ హక్కుల పరిరక్షణ దిశగా ఆమె సేవలు సంస్థకు మరింత బలాన్ని చేకూరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేసింది.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
బాయ్స్ హైస్కూల్ లో పర్వీన్ తాజ్ ఫుడ్ చెకింగ్
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని బాయ్స్ హైస్కూల్ లో పార్టీ ఆదేశానుసారం పార్లమెంట్ సెక్రటరీ...
By Kothuru Murali 2026-04-08 11:08:39 0 169
Telangana
బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు)...
By Sidhu Maroju 2025-12-29 15:46:07 0 241
Andhra Pradesh
రాజాంలో స్నేక్ క్యాచర్ ని కాటేసిన పాము
రాజాంలోని తెలగా వీధిలో గురువారం రాత్రి పామును పడుతుండగా స్నేక్ క్యాచర్ గ్రంధి అప్పారావు పాము...
By Boiena Rajesh 2026-07-17 05:57:44 0 161
Delhi - NCR
Delhi Weather Update: Temperature crosses 45 degrees Celsius; orange alert issued
The India Meteorological Department (IMD) has issued an orange alert in Delhi due to heatwave...
By Bharat Aawaz 2025-06-10 07:32:32 0 2K
Andhra Pradesh
మదనపల్లి : కోడలపై అత్తామామల దాడి.
మదనపల్లెలో బుధవారం నాడు జరిగిన ఘటనలో, నక్కలదిన్నె తండాకు చెందిన రవినాయక్ భార్య తన అత్తమామలు...
By Pagadala Venkateswar 2026-04-23 03:31:39 0 138
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com