Chandrababu Naidu: రాష్ట్రంలో హింసను ప్రేరేపించాలని చూస్తోంది.. వైసీపీపై చంద్రబాబు ఫైర్.

0
193

అధికారం కోల్పోయామనే అసహనంతో రెచ్చగొట్టేందుకు యత్నం

ఆ పార్టీ ట్రాప్ లో పడొద్దంటూ పార్టీ నేతలకు సూచన

 

మంత్రులు, టీడీపీ సీనియర్ నేతలతో సీఎం టెలీకాన్ఫరెన్స్

ఆంధ్రప్రదేశ్ లో అలజడి సృష్టించాలని, హింసను ప్రేరేపించాలని వైసీపీ ప్రయత్నిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోందని... ఆ ట్రాప్ లో పడొద్దని టీడీపీ నేతలకు ఆయన సూచించారు. ఈ మేరకు మంత్రులు, పార్టీ సీనియర్ నేతలతో ఆయన ఈ రోజు ఉదయం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

అధికారం కోల్పోయామనే అసహనంతోనే వైసీపీ రెచ్చగొట్టాలని చూస్తోందని చంద్రబాబు చెప్పారు. అందుకే ఆ పార్టీ నేతలు బూతులు మాట్లాడుతున్నారని, సంయమనం పాటించాలని చెప్పారు. ఈ టెలీకాన్ఫరెన్స్ లో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

 

వైసీపీ రెచ్చగొట్టే చర్యలకు దిగుతోందన్న చంద్రబాబు.. ఆ పార్టీ ఉచ్చులో పడి టీడీపీ శ్రేణులు సంయమనం కోల్పోకుండా చూసుకోవాల్సిన బాధ్యత సీనియర్ నేతలదేనని చెప్పారు. హింస, విధ్వంసం, అవినీతి పునాదులపై వైసీపీ పుట్టిందని, ఆ పార్టీ ట్రాప్‌లో పడితే వారికీ మనకూ తేడా ఉండదని అన్నారు. ఈ సందర్భంగా తప్పుచేసిన ప్రతి ఒక్కరినీ చట్టపరంగా శిక్షించి తీరుతామని చంద్రబాబు స్పష్టం చేశారు.

 

తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో అడ్డంగా దొరికిపోయిన వైసీపీని రాష్ట్ర ప్రజలు చీదరించుకుంటున్నారని అన్నారు. ఈ క్రమంలో తాము చేసిన పాపాల నుంచి ప్రజల దృష్టి మళ్లించాలని ఆ పార్టీ నేతలు కుట్రలు పన్నుతున్నారని చెప్పారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలన్న టీడీపీ అజెండా సహజంగానే వైసీపీ నేతలకు నచ్చదని చంద్రబాబు గుర్తుచేశారు. అందుకే అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు.

Search
Categories
Read More
Goa
Goa’s Muddy Marvel: The Vibrant Chikhal Kalo Celebration
Experience the infectious joy of Goa’s unique "mud bath" festival, Chikhal Kalo, held...
By Lokeshwari Panthadi 2026-06-30 04:13:30 0 85
Telangana
కాలనీలను అభివృద్ధి చేసే బాధ్యత నాది: కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్ :   కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ గురువారం వార్డు 7 పరిధిలోని IOB...
By Sidhu Maroju 2025-09-11 16:14:07 0 349
Telangana
ఎండవేడులకు ప్రజలు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు....
భారత్ అవాజ్ న్యూస్ :తెలంగాణ ఎండలు. దంచికొడుతున్నాయి.ఎండలు, వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి...
By Gujile Ramu 2026-05-03 15:41:34 0 180
Telangana
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 - వీధి దీపాలు వెలగక తీవ్ర ఇబ్బంది పడుతున్న కాలనీవాసులు.
సాయి రెడ్డి కాలనీ రోడ్ నెంబర్ 10 – వీధి దీపాల సమస్యతో ఇబ్బందులు   అల్వాల్ సర్కిల్...
By Sidhu Maroju 2025-07-29 17:08:50 0 927
BMA
Bengal Journalists Attacked by Mobs on Duty
Press freedom in West Bengal continues to face severe threats from political...
By JoinBMA 2026-08-19 08:38:56 0 74
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com