మాకు ఇచ్చే వేతనం దేశ భవిష్యత్తుకు పెట్టుబడి

0
551

విద్య కమీషన్ ఇచ్చిన రిపోర్ట్ లో ఉపాధ్యాయులకు వేతనాలు ఎక్కువ.... అనే వాక్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము

మహబూబాబాద్ ఫిబ్రవరి 27 (భారత్ ఆవాజ్): నిన్న విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వంకు అందించిన ఎడ్యుకేషన్ పాలసీ పర్ తెలంగాణ, 2026 సుదీర్ఘ రిపోర్టులో ఉపాధ్యాయులకు వేతనాలు మార్కెట్ ప్రమాణాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి అనే వ్యాఖ్యానం పూర్తిగా అనుచితమైనది, వాస్తవాలకు విరుద్ధమైనదని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ అధ్యక్షలు నెల్లుట్ల భాస్కర్ ఖండించడం జరిగింది. ఉపాధ్యాయులు సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు. భవిష్యత్ తరాలను తీర్చిదిద్దే బాధ్యత వారి భుజాలపై ఉంటుంది. అలాంటి మహత్తర సేవ చేస్తున్న ఉపాధ్యాయుల జీతాలను “ఎక్కువ” గా పేర్కొనడం వారి కృషిని తక్కువ చేసి చూపించే ప్రయత్నమే అవుతుంది. జీతాలు అనేవి సాధారణంగా ధరల పెరుగుదల (ద్రవ్యోల్బణం)కు అనుగుణంగా సవరించబడతాయి. నిత్యావసర వస్తువుల ధరలు, ఇంధన వ్యయం, గృహ వసతి ఖర్చులు వంటి అంశాలు పెరుగుతున్నప్పుడు ఉద్యోగుల జీవన వ్యయం కూడా పెరుగుతుంది. అందువల్ల జీతాల్లో సవరణలు చేయడం సహజమైన పరిపాలనా ప్రక్రియ. ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుల జీతాలను “అత్యధికం”గా పేర్కొంటూ రిపోర్ట్ లో పెట్టడం సముచితం కాదు. ఇది వారి వాస్తవ పరిస్థితులను, బాధ్యతలను, అర్హతలను పరిగణనలోకి తీసుకోని వ్యాఖ్యగా భావించవచ్చు.. వారు మార్కెట్ ప్రమాణాలను అని భావించిన పాఠశాలలు చెల్లించాల్సిన భత్యాలు తక్కువ చెల్లిస్తూ చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడితే బాగుండేది.

• ఉపాధ్యాయులు కేవలం పాఠాలు చెప్పేవారే కాదు; భవిష్యత్ పౌరులను తీర్చిదిద్దే బాధ్యతను నిర్వహిస్తున్నారు 

నాణ్యమైన విద్య ఇవ్వాలంటే ముందుగా ఉపాధ్యాయ వృత్తిని ఆకర్షణీయంగా, గౌరవప్రదంగా మార్చాలి. సరైన వేతనం ఇవ్వడం అనేది ఖర్చు కాదు. అది దేశ భవిష్యత్తులో పెట్టుబడి.సరైన మరియు గౌరవప్రదమైన జీతభత్యాలు ఉన్నప్పుడే నిష్ణాతులు, ప్రతిభావంతులు, తెలివైన యువత ఉపాధ్యాయ వృత్తిని ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.వృత్తి స్థిరత్వం, ఆర్థిక భద్రత, సామాజిక గౌరవం — ఈ మూడు అంశాలు కలిసే ఒక మంచి ఉపాధ్యాయ వ్యవస్థ ఏర్పడుతుంది. తక్కువ వేతనం, అధిక బాధ్యతలు ఉన్న వృత్తిని ప్రతిభావంతులు ఎంచుకోవడానికి ఆసక్తి చూపరు. ఫలితంగా విద్యా రంగంలో నాణ్యత తగ్గే ప్రమాదం ఉంటుంది.

ఉపాధ్యాయులకు పదోన్నతులు సీనియారిటీ ద్వారా కాకుండా పారామీటర్ల ద్వారా అనడం అర్థరహితం.....అవగాహన రాహిత్యం....మరియు సర్వీస్ రూల్స్ కు పూర్తి గా వ్యతిరేకం. దాదాపు నియామకం అయిన కేడర్ లోనో లేక దాదాపు రెండు దశాబ్దాలు (సుమారు 20 సం రాలకు కూడా రాని పదోన్నతి )సర్వీస్ చేస్తే కానీ పదోన్నతి రాని ఉపాధ్యాయులకు పదోన్నతి సీనియారిటీ కాకుండా పారామీటర్ ల ఆధారంగా పదోన్నతి అనేదానిని DTF సంఘం వ్యతిరేకిస్తుంది. 

• HM పోస్టులకు 50% నియామకం ద్వార నీయమించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నాం

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులకు ఒక పాఠశాలను సమర్థవంతంగా నడపగలరు అందుకే ప్రస్తుతం ఉన్న సర్వీస్ రూల్స్ ప్రకారం ప్రధానోపాద్యాయుల పోస్టులను కేవలం పదోన్నతి ద్వారా మాత్రమే భర్తీ చేస్తున్నారు.. అలాగే కొనసాగించడం సమంజసం.. అలాగే కొనసాగించాలని కోరుతున్నాము. MRO , ప్రిన్సిపాల్ పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ తదితర పోస్టులు కు అనుభవం వలన ఇచ్చే పదోన్నతులు ..ఈ మార్పును DTF సంఘం వ్యతిరేకిస్తుంది. 

• ఉపాధ్యాయుల అర్హతల నిర్ణయ అధికారం NCTE కి ఉంది దానిని ఎలా మార్పు చేస్తారు...?

ఉపాద్యాయుల అర్హతలకు సంబంధించి NCTE (National Council For Teacher Education) అనేది భారత ప్రభుత్వం స్థాపించిన జాతీయ స్థాయి విద్యా శిక్షణ సంస్థ సూచించిన విధంగా ప్రస్తుతం ఉన్న ఉపాద్యాయులు కలిగి ఉన్నారు.. తదుపరి నియామకం కూడా వాటి ఆధారంగానే జరగాలని నెల్లుట్ల .భాస్కర్ జిల్లా అధ్యక్షులు డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మహబూబాబాద్ జిల్లా శాఖ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
SURAKSHA
తెలంగాణ పోలీసులు నేడు: విధి దాటి మానవ సేవ
Description: తెలంగాణ పోలీసులు ఈరోజు మరోసారి మానవత్వం చాటుకున్నారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో...
By Kalaga Sailaja 2026-07-06 04:49:37 0 101
SURAKSHA
North Andhra Upgrades to Advanced Tech-Driven Police Command Control Room
 A state-of-the-art Command Control Room was recently inaugurated in the Visakha Range....
By Kalaga Sailaja 2026-06-30 12:15:05 0 95
Telangana
హైదరాబాద్ ప్రభుత్వ పాఠశాలలో దారుణం.|
హైదరాబాద్ – పేట్ బషీరాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలోని కొంపల్లి ప్రభుత్వ పాఠశాలలో 7వ...
By Sidhu Maroju 2025-12-23 11:59:58 0 302
Andhra Pradesh
దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు
*ప్ర‌చుర‌ణార్థం* *21-02-2026*   *దేవుడి చిత్రపటాలతో రాజకీయాలు తగవు : ఎన్టీఆర్...
By Rajini Kumari 2026-02-21 16:49:22 0 181
Andhra Pradesh
విశాఖ రైల్వే జోన్‌పై కేంద్రం గెజిట్.. మోదీ, చంద్రబాబుకు లోకేష్ ధన్యవాదాలు.
విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌పై గెజిట్ విడుదల ఏపీ చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్న...
By Pagadala Venkateswar 2026-05-06 07:30:13 0 130
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com