Ambati Rambabu: అంబటి రాంబాబుకు 14 రోజుల రిమాండ్.

0
195

సీఎం చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యల కేసులో అంబటి రాంబాబును అరెస్టు చేసిన పోలీసులు

అంబటి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ 

 

న్యాయాధికారి ఉత్తర్వులతో అంబటిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలింపు

వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుకు గుంటూరు మొబైల్‌ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన కేసులో పోలీసులు శనివారం రాత్రి ఆయనను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. 

 

విషయంలోకి వెళితే.. గుంటూరు అమరావతి రోడ్డులోని గోరంట్ల వద్ద శుక్రవారం తిరుమల లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అంశంపై ‘మహాపాపం’ పేరుతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ వద్దకు వెళ్లిన అంబటి రాంబాబు.. 24 గంటల్లో ఫ్లెక్సీ తొలగించాలని హెచ్చరించారు. శనివారం ఉదయం గోరంట్లలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో పూజలు చేసిన అనంతరం అదే మార్గంలో కారులో వెళ్తుండగా టీడీపీ శ్రేణులు అంబటిని అడ్డుకున్నారు. 

 

ఈ క్రమంలో ఆగ్రహించిన అంబటి రాంబాబు కారులో నుంచే తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కారులో ఉన్నవారు వీడియోగా రికార్డు చేయడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కూటమి శ్రేణులు కారుపై కర్రలు, పిడిగుద్దులతో దాడి చేశాయి. అక్కడి నుంచి వెళ్లాలని పోలీసులు సూచించినా అంబటి వినిపించుకోకుండా మళ్లీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కారులో నుంచి దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరకు అద్దం దించి సీఎం చంద్రబాబుపై తీవ్ర పరుష పదజాలంతో దూషించినట్లు పోలీసులు పేర్కొన్నారు. 

 

ఈ ఘటనతో రాష్ట్రవ్యాప్తంగా కూటమి శ్రేణుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. గుంటూరు సిద్ధార్థనగర్‌లో అంబటి రాంబాబు నివాసం, కార్యాలయంపై శనివారం సాయంత్రం దాడులు జరగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అంబటిపై తక్షణ చర్యలు తీసుకోవాలంటూ పలుచోట్ల పోలీస్‌ స్టేషన్‌లలో ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పిల్లి మాణిక్యరావు, నల్లపాడు ఎస్సై కె. రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుల ఆధారంగా అంబటిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. శనివారం రాత్రి 10.45 గంటల సమయంలో ఆయనను అరెస్టు చేశారు. కట్టుదిట్టమైన భద్రత మధ్య నల్లపాడు పోలీస్‌ స్టేషన్‌కు ఆయనను తరలించారు. 

 

విచారణ, వైద్య పరీక్షల ఆనంతరం ఆదివారం రాత్రి న్యాయాధికారి ముందు అంబటిని పోలీసులు హాజరుపర్చగా, ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయాధికారి 14 రోజులు రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. న్యాయాధికారి ఆదేశాలతో అంబటి రాంబాబును పోలీసులు రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:హైవేపై రోడ్డు ప్రమాదం కొత్తూరు మురళి
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల క్రాస్ వద్దగల హైవేపై గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-05-22 14:18:09 0 139
Andhra Pradesh
AP Land Prices: ఏపీలో ఆ భూములకు మార్కెట్ ధరలు పెంపు.. ఫిబ్రవరి 1 నుంచి అమలు.
AP Land Prices Andhra Pradesh Hikes Land Values in Urban Areas ఏపీలో పట్టణ ప్రాంత భూముల విలువలు...
By Pagadala Venkateswar 2026-01-25 06:22:43 0 216
Andhra Pradesh
Agriculture Modernization and Farmer Welfare in Andhra
Andhra Pradesh is advancing agricultural modernization in 2026 through the adoption of innovative...
By Fathima Safa 2026-06-17 05:17:25 0 352
Maharashtra
Maharashtra Advances Women and Child Welfare Programs
Maharashtra continues to strengthen women and child welfare through initiatives focused on...
By Fathima Safa 2026-06-30 08:55:57 0 136
SURAKSHA
Jawed Shamim IPS: Leading STF with Courage and Precision
A distinguished IPS officer whose fearless leadership, intelligence-driven policing, and...
By Lokeshwari Panthadi 2026-07-28 12:14:43 0 214
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com