మైనంపల్లి సహకారంతో అభివృద్ధి దిశగా మచ్చ బొల్లారం.|

0
210

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : వార్డు నెంబర్ 133 మచ్చ బొల్లారం డివిజన్ పరిధిలోని ప్రధాన రహదారుల అభివృద్ధికి ముందడుగు పడింది. సెలెక్ట్ టాకీస్ నుండి మచ్చ బొల్లారం వాటర్ ట్యాంక్ వరకు తీవ్రంగా దెబ్బతిన్న బిటి (BT) రోడ్డు అభివృద్ధి పనుల కోసం ₹238 లక్షల నిధులను జిహెచ్ఎంసి(GHMC) స్టాండింగ్ కమిటీ పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. 

నిరంతర కృషితో నిధుల మంజూరు :

గత ఏడాది ఆగస్టు 2025 లో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు మద్దతుతో, డివిజన్ ల్లోని సీసీ రోడ్లు, బీటీ రోడ్ల అభివృద్ధిపై జిహెచ్ఎంసి కమిషనర్ కు కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ సమగ్ర వినతి పత్రం సమర్పించారు. ఈ ప్రతిపాదనలను సాంకేతిక బృందం పరిశీలించిన అనంతరం, జనవరి 21న జనరల్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చర్చించి, జనవరి 29న తుది ఆమోదం తెలిపారు.

సెలెక్ట్ టాకీస్ నుండి వాటర్ ట్యాంక్ వరకు ఉన్న ఈ రహదారి నివాస కాలనీలను కొంపల్లి- బొల్లారం హైవేను మరియు రైల్వే స్టేషన్ ను కలిపే అత్యంత కీలక దారి. రహదారి దెబ్బతినడం వల్ల ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ నిధులు కేటాయించారు.

ఈ అభివృద్ధి పనులకు సహకరించిన మేయర్ గద్వాల విజయలక్ష్మి, జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి. కర్ణన్ లకు స్టాండింగ్ కమిటీ సభ్యులకు, కార్పొరేటర్  రాజ్ జితేంద్రనాథ్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 

డివిజన్ సమగ్ర అభివృద్ధి కోసం మిగతా ప్రతిపాదనలను కూడా మైనంపల్లి సూచనలతో త్వరలోనే మంజూరు చేయిస్తానని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

#sidhumaroju 

Alwal 

Search
Categories
Read More
Technology
BSNL Launches Gold International Roaming Plan: Stay Connected in 18 Countries at Just ₹180/Day
BSNL Launches Gold International Roaming Plan: Stay Connected in 18 Countries at Just ₹180/Day...
By BMA ADMIN 2025-05-22 18:03:45 0 2K
West Bengal
EC Doubles Security Measures Ahead of Falta Repoll
The Election Commission has significantly upgraded security deployment for the upcoming May 21...
By Dunna Jessicaruth 2026-05-20 10:43:15 0 215
Andhra Pradesh
'బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో నష్టం'
బాల్య వివాహాలు, టీనేజ్ గర్భధారణతో ఆరోగ్యానికి నష్టమని ఐసీడీఎస్ సీడీపీవో జాగాన విజయలక్ష్మి...
By Boiena Rajesh 2026-03-05 14:42:13 0 393
Andhra Pradesh
సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎంపీ కేసినేని శివనాథ్
*ప్ర‌చుర‌ణార్థం* *18-12-2025*   సీఎం చంద్ర‌బాబు కు స్వాగ‌తం...
By Rajini Kumari 2025-12-19 10:08:02 0 261
Andhra Pradesh
శ్రీకాకుళం నూతన బార్ కౌన్సిల్ అధ్యక్షుడు సీనియర్ న్యాయవాది కున రాజారావు
జిల్లా బార్‌ అసోసియేషన్‌ ఎన్నికల్లో సీనియర్‌ న్యాయవాది కూన రాజారావు అధ్యక్షుడిగా...
By Manda Ramkumar 2026-03-27 04:55:05 0 227
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com