గ్రామ పంచాయతీ రికార్డుల తనిఖీ

0
443

శాయంపేట మండలం లోని మైలారం గ్రామంలో పంచాయతీ రిజిస్టర్ లను తనిఖీ చేసారు ఎంపీఓ రంజిత్ కుమార్.ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కి నూతన పాలకవర్గం ఎన్నికైన సమయం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో, వాటిని ప్రజా ప్రయోజనాల కోసం ఎక్కడ వినియోగించారు అని కార్యదర్శిని అడిగి తెలుసుకున్నారు. తీర్మానాలు అయినా కూడా ఇంకా పెండింగ్ లోనే ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. అదే విధంగా గ్రామ పంచాయతీ పై ఉన్న సుమారు 24 లక్షల విద్యుత్ బిల్లుకు గల కారణాలను తెలుసుకుని , అనవసర వినియోగాన్ని తగ్గించి గ్రామ పంచాయతీ పై భారం తగ్గించే విధంగా పని చేయాలని చెప్పారు.

  బెల్టు షాపులను బహిష్కరించాలి 

గ్రామంలోని యువజన సంఘాల సభ్యులు అందరూ ఏకమై గ్రామ పంచాయతీ పరిధిలో అక్రమంగా నడుపుతున్న బెల్టు షాపుల వలన చాలా కుటుంబాలు నష్ట పడుతున్నాయని యువత కూడా మద్యానికి బానిసలు గా మారుతున్నారని కాబట్టి గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్టు షాపులను గ్రామ పంచాయతీ తీర్మానం చేసి తొలగించేలా చేయాలని వినతి పత్రం అందచేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ , ఉప సర్పంచ్, వార్డు సభ్యులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Uncategorized
The Rise of "Quiet Commuting"
A fascinating lifestyle shift is dominating May 2026: "quiet commuting." With hybrid work firmly...
By Dunna Jessicaruth 2026-05-19 06:37:28 0 169
Andhra Pradesh
జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో పాలగొన్న: కలెక్టర్.
అమరావతిలో శుక్రవారం జరిగిన జనగణన-2027 రాష్ట్రస్థాయి సమావేశంలో అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్...
By Pagadala Venkateswar 2026-02-21 04:30:49 0 203
Telangana
నిజామాబాద్:
ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో, ఈరోజు వార్డు సభలో 39 వ డివిజన్ సమస్యల గురించి అధికారుల దృష్టికి...
By Sadaq Sadaq 2026-06-08 09:15:30 0 146
Andhra Pradesh
పుంగనూరులో వేడుకగా శ్రీవారి కళ్యాణం
పుంగనూరు పట్టణంలో టీటీడీ ఆధ్వర్యంలో జరుగుతున్న శ్రీకళ్యాణ వేంకటరమణ స్వామివారి వార్షిక...
By Kothuru Murali 2026-03-03 11:47:26 0 196
Andhra Pradesh
తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామివారి హుండీ ఆదాయం రూ. 32 లక్షలు
కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలోని శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో భక్తులు...
By Ratna Sekhar 2026-02-11 14:01:48 0 400
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com