TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.

0
531

తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో కల్తీ జరగలేదని సిట్ ఎక్కడా చెప్పలేదని ఆయన అన్నారు. కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ నేతలు చెబుతున్నవన్నీ అవాస్తవాలేనని చెప్పారు. కల్తీ నెయ్యిని సరఫరా చేసి... ఇప్పుడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కర్నూలులో పింఛన్లను పంపిణీ చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

 

తిరుమలను కాపాడేది కూటమి ప్రభుత్వం మాత్రమేనని భరత్ చెప్పారు. తప్పు చేసి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికైనా శ్రీవేంకటేశ్వర స్వామి ముందుకు వచ్చి క్షమాపణలు కోరాలని అన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయంపై చర్చిస్తామని తెలిపారు. ఒకరోజు ముందే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లను పంపిణీ చేశామని చెప్పారు. దావోస్ పర్యటనలో ఏపీని అద్భుతంగా ప్రమోట్ చేశామని తెలిపారు. దీని అద్భుత ఫలితాలు త్వరలోనే కనిపిస్తాయని చెప్పారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు.
రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర...
By Pagadala Venkateswar 2026-05-11 06:30:12 0 135
Andhra Pradesh
మంత్రులు కలిసిన జిల్లా అధికార ప్రతినిధి బిజెపి నేత గుర్రాజ్ దేశాయ్
 శ్రీ మంత్రి నిమ్మల రామానాయుడు గారిని మరియు మంత్రి శ్రీ టీజి భరత్ గారిని మర్యాదపూర్వకంగా...
By Boya Dasthagiri 2026-04-01 05:53:28 0 214
Andhra Pradesh
పుంగనూరు: రోజురోజుకు పెరుగుతున్న చలి తీవ్రత.
పుంగనూరు నియోజకవర్గ మండలాలలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. గురువారం ఉదయం చలిని తట్టుకోలేక...
By Kothuru Murali 2026-01-29 08:51:21 0 199
Rajasthan
Title Rajasthan Farmers Shift To Bajra Amid Monsoon Risks
Faced with highly unpredictable and uneven monsoon forecasts, farmers across western Rajasthan...
By Lokeshwari Panthadi 2026-06-27 06:18:33 0 148
Andhra Pradesh
Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు.
చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు నోటీసులు...
By Pagadala Venkateswar 2026-02-13 06:51:44 0 177
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com