Perni Nani: పేర్ని నానికి నోటీసులు ఇవ్వండి: ఏపీ హైకోర్టు.

0
174

చంద్రబాబు, పవన్ లను దూషించిన కేసు

పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసిన హైకోర్టు

నోటీసులు ఇచ్చి విచారించాలని హైకోర్టు ఆదేశం

 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ లను దూషించిన అంశానికి సంబంధించి మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నానిపై మచిలీపట్నం ఇనగుదురుపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో పేర్ని నాని క్వాష్ పిటిషన్ వేశారు. 

 

ఈ పిటిషన్ ను నిన్న విచారించిన హైకోర్టు పేర్ని నానికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించింది. పేర్ని నానిపై నమోదైన కేసులు ఏడేళ్లలోపు శిక్షకు సంబంధించినవేనని... క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 35(3) ప్రకారం ఆయనకు నోటీసులు ఇచ్చి, విచారణ కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. పేర్ని నాని క్వాష్ పిటిషన్ ను కొట్టివేసింది. తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.

Search
Categories
Read More
Telangana
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు
శ్రీ కృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు! భారత్ ఆవాజ్ తరపున మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు....
By VALLERU SIMHADRI 2026-09-04 13:03:46 0 212
Andhra Pradesh
పుంగనూరు: ఉర్సులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీపీ నేత
పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు...
By Kothuru Murali 2026-05-09 14:45:53 0 196
Andhra Pradesh
ఓ మహిళ ఆవేదన .
తనకుపూర్వీకుల నుండి వచ్చిన మా పూరి గుడిసె స్థలములో ఇల్లు కట్టు కోవ లని మేము ప్రయత్ని స్తుంటే...
By Mobbu Venkatramana 2026-02-23 15:04:22 0 298
Andhra Pradesh
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి ఎరిక్షన్ బాబు గారు...
ప్రధాన మంత్రి ఉజ్వల యోజన పథకం గిరిజన చెంచు మహిళలకు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేసిన గూడూరి...
By Chennaiah Kati 2026-01-26 15:54:23 0 245
Andhra Pradesh
రూ.25,08,000ల మోసం
రైల్వేలో టీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.25,08,000లు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు...
By Boiena Rajesh 2026-09-16 03:39:20 0 89
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com