ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు.

0
131

రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు

నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం

భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ప్రసంగం

నీతి ఆయోగ్ సభ్యులతోనూ భేటీ కానున్న ముఖ్యమంత్రి

రేపు అస్సాం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు, రేపు ఢిల్లీ, అస్సాం రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో ఆయన పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు.

 

వివరాల్లోకి వెళ్తే, ఈరోజు ఉదయం చంద్రబాబు ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు. అక్కడ 11.30 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో సమావేశమవుతారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అనంతరం, సాయంత్రం 4 గంటలకు హోటల్ తాజ్ ప్యాలెస్‌లో జరిగే భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు. ఆ తర్వాత ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి ఛైర్మన్ ఎస్. మహేంద్రదేవ్, నీతి ఆయోగ్ సభ్యులతో కూడా ఆయన భేటీ కానున్నారు.

 

రాత్రికి ఢిల్లీలోనే బస చేసి, మంగళవారం ఉదయం అక్కడి నుంచి గువాహటికి వెళ్తారు. అస్సాం నూతన ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతారు. ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత ఆయన తిరిగి అమరావతికి బయల్దేరి వస్తారు.

Search
Categories
Read More
Telangana
"మిషన్ 'కొత్త చెరువు': క్షేత్రస్థాయిలో మాజీ కార్పొరేటర్ తనిఖీ.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : స్థానిక ప్రజల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా కొత్త చెరువులో పేరుకుపోయిన...
By Sidhu Maroju 2026-04-16 07:10:14 0 352
Andhra Pradesh
Nara Lokesh: లోకేశ్ ఇంట కూటమి నేతల సందడి.. ఇవాళ చిత్తూరు, అనకాపల్లి నేతలకు ఆతిథ్యం.
మంత్రి లోకేశ్ సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చిత్తూరు, అనకాపల్లి కూటమి నేతలకు ఆత్మీయ విందు...
By Pagadala Venkateswar 2026-02-14 06:10:03 0 184
Telangana
రాఖీ రద్దీ... నల్లబెల్లిలో బస్సులు కిటకిట...
భారత్ అవాజ్ న్యూస్: వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం శ్రావణ పౌర్ణమి (రాఖీ పండుగ) సందర్భంగా...
By Gujile Ramu 2026-08-28 07:19:12 0 124
Andhra Pradesh
శ్రీకాకుళం: 'టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోవాలి'
శ్రీకాకుళం నగరంలో జర్నలిస్టుపై జరిగిన దాడికి నిరసనగా జర్నలిస్టు నాయకులు ఆందోళన చేపట్టారు. ఆ...
By Manda Ramkumar 2026-03-28 09:00:03 0 556
Andhra Pradesh
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు
నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు గట్టి కౌన్సిలింగ్ చేస్తున్న గుంటూరు పోలీసులు...
By Chennaiah Kati 2026-06-29 05:41:40 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com