Pawan Kalyan: కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానన్న మహిళ... స్పందించిన పవన్ కల్యాణ్.

0
217

Andhra

Pawan Kalyan Responds to Womans Loss of Baby Due to KGH Negligence

కేజీహెచ్ వైద్యుల నిర్లక్ష్యంతో బిడ్డను కోల్పోయానంటూ మహిళ ఆవేదన

విశాఖ విమానాశ్రయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఫిర్యాదు

 

బాధ్యులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరిన బాధితురాలు

సోమవారం నాడు సచివాలయానికి రావాలని కుటుంబానికి ఆహ్వానం

విశాఖపట్నం కింగ్ జార్జ్ హాస్పిటల్ (కేజీహెచ్) వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వెంటనే స్పందించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనలాంటి పరిస్థితి మరెవరికీ రాకుండా చూడాలని ఆ మహిళ కన్నీటితో వేడుకుంది. ఆమె వేదనకు చలించిన పవన్ కల్యాణ్, బాధిత కుటుంబాన్ని సోమవారం సచివాలయంలోని తన కార్యాలయానికి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

 

వివరాల్లోకి వెళితే, శుక్రవారం రాత్రి తన విశాఖ పర్యటన ముగించుకుని తిరిగి వెళుతున్న సమయంలో విమానాశ్రయంలో పట్నాల ఉమాదేవి అనే మహిళ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను కలిశారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో ప్రసవం కోసం తాను కేజీహెచ్‌లో చేరానని, అప్పటి నుంచి వైద్యులు, సిబ్బంది తన పట్ల అత్యంత నిర్లక్ష్యంగా, అమానవీయంగా ప్రవర్తించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

 

"కాన్పుకు ఇచ్చిన గడువు ముగిసిపోయిందని చెప్పినా వారు పట్టించుకోలేదు. సాధారణ ప్రసవం పేరుతో నన్ను నరకయాతనకు గురిచేశారు. నా పరిస్థితి ఆందోళనకరంగా ఉందని కుటుంబ సభ్యులు పదేపదే చెప్పినా వినలేదు. పైగా మాపై తీవ్ర పదజాలంతో దూషించారు. ప్రసవ సమయంలో ఒకరు నా గుండెలపైకి ఎక్కి కూర్చొని నొప్పితో విలవిల్లాడుతున్నా కనికరించలేదు" అని ఉమాదేవి ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయంలో సిజేరియన్ చేయకపోవడం వల్లే తాను మృత శిశువుకు జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె వాపోయారు.

 

కేజీహెచ్ సిబ్బంది తీరు వల్ల తనకు శారీరక హింసతో పాటు జీవితాంతం మరిచిపోలేని మానసిక వేదన మిగిలిందని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె ఉప ముఖ్యమంత్రిని కోరారు.

 

ఉమాదేవి ఆవేదనను ఓపికగా విన్న పవన్ కల్యాణ్ వెంటనే చలించిపోయారు. ఆమెకు ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ విషయంపై పూర్తి వివరాలు తెలుసుకుని, తగిన న్యాయం చేసేందుకు ఆమెను, ఆమె కుటుంబ సభ్యులను తన కార్యాలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఈ ఘటనపై వైద్యారోగ్య శాఖ అధికారులతో కూడా మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చినట్లు తెలిసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
రామాపురం మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం రామాపురం మండలం రామాపురం మండలంలో నూతనంగా నిర్మించిన తెలుగుదేశం...
By Benguluri Madhubabu 2026-03-16 13:04:57 0 267
Andhra Pradesh
క్రీడలతో యువతను ప్రోత్సహిం- గూడూరు ఏరీక్షణ బాబు
క్రీడలతో యువతకు ప్రోత్సాహం - గూడూరి ఎరిక్షన్ బాబు గారు యర్రగొండపాలెం పట్టణంలోని MRO కార్యాలయ...
By Chennaiah Kati 2026-01-14 06:14:18 0 292
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి.
మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన...
By Pagadala Venkateswar 2026-05-08 05:29:48 0 161
Telangana
ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి
టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ ...
By Bheeshman King 2026-07-01 12:47:02 0 632
Telangana
ప్రతి ఓటు రక్షణే లక్ష్యం: శ్రీనివాస్ వర్మ.|
"అల్వాల్‌లో సీనియర్ సిటిజన్స్‌కు SIRపై అవగాహన సదస్సు" మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :...
By Sidhu Maroju 2026-07-01 14:00:24 0 209
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com