అల్వాల్ పోలీసుల నిఘానేత్రం - నేరాల నియంత్రణే లక్ష్యం.|

0
247

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్, మరియు కమ్యూనిటీ పోలీసింగ్ కార్యక్రమాలు ముమ్మరంగ సాగుతున్నాయి.

పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు, అల్వాల్ ఎస్హెచ్ఓ ప్రశాంత్ పర్యవేక్షణలో, సెక్టార్ ఎస్సై గీత, ఏఎస్ఐ తుల్జారాం, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ రెడ్డి, మరియు కానిస్టేబుల్ నరేష్ బృందం శుక్రవారం యాదమ్మ నగర్ కాలనీలో పర్యటించారు.

 

ఈ సందర్భంగా కాలనీ వాసులతో సమావేశమైన పోలీసులు, పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గుర్తు తెలియని వ్యక్తులు పంపే లింకులను క్లిక్ చేయవద్దని, ఏదైనా మోసం జరిగితే వెంటనే 1930 నంబర్ కు, లేదా.. నేషనల్ సైబర్ క్రైమ్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు.

 

అంతేకాకుండా ఫోక్సో (POCSO) చట్టం మహిళల భద్రత. ట్రాఫిక్ నిబంధనలు,మరియు మాదకద్రవ్యాల నియంత్రణ (NDPS) చట్టాలపై ప్రజలకు సమగ్ర అవగాహన కల్పించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకమని, ప్రతి కాలనీలో నిఘా వ్యవస్థను బలోపేతం చేసుకోవాలని పోలీసులు కోరారు. 

 

ఆలయ భద్రత తనిఖీలు :

అనంతరం శివ నగరంలోని శివాలయం ఆలయాన్ని సందర్శించిన  ఎస్హెచ్వో  ప్రశాంత్, సెక్టార్ ఎస్సై గీత, ఆలయ భద్రతా చర్యలను సమీక్షించారు. గుడి ప్రాంగణంలో ఏర్పాటుచేసిన సీసీ కెమెరాలు తీరును స్వయంగా తనిఖీ చేశారు. 

భక్తుల భద్రత దృష్ట్యా సీసీ కెమెరాలు అన్ని నిరంతరం పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని ఆలయ నిర్వాహకులకు సూచనలు చేశారు. 

ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే స్థానిక పోలీసులకు, లేదా.. డయల్-100/112 కి సమాచారం అందించాలని కోరారు. 

 

#sidhumaroju

Alwal

Search
Categories
Read More
Telangana
ప్రపంచ శాంతి కోసమే క్రైస్తవ ఉజ్జీవ సభనలు: ఎమ్మెల్యే శ్రీ గణేష్
సికింద్రాబాద్: కంటోన్మెంట్|  మడ్ ఫోర్డ్ హాకీ గ్రౌండ్స్ లో ప్రపంచ శాంతి కోసం ఫాదర్...
By Sidhu Maroju 2025-10-25 16:14:32 0 309
Andhra Pradesh
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం....
ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరణం.... చీరాల: రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు మరియు...
By Gadiyapudi Narendra 2026-01-01 12:05:33 0 421
Manipur
Displaced Families Blocked from Returning to Village in Manipur
 Security forces in Manipur halted the return of nearly 100 internally...
By Bharat Aawaz 2025-07-17 06:59:52 0 1K
Andhra Pradesh
ప్రతి రోజూ ఉచిత భోజనం
శ్రీసత్య సాయి సోషియల్ వెల్ఫేర్ ట్రస్ట్  వారు విశాఖ కేజీ హేచ్ ఆసుపత్రి ఎదుట ప్రతి రోజూ...
By Mobbu Venkatramana 2026-01-17 08:16:26 0 634
Andhra Pradesh
అన్నమయ్య జిల్లాలో పలువురు సి ఐ లు బదిలీలు.
అన్నమయ్య జిల్లాలో పలువురు సబ్-ఇన్స్పెక్టర్లు (సీఐలు) బదిలీ అయ్యారు. కర్నూల్ రేంజ్ డిఐజి కోయ...
By Pagadala Venkateswar 2026-02-10 04:26:57 0 184
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com