AP Pensions: ఏపీలో పింఛనుదారులకు గుడ్ న్యూస్.. ఒక రోజు ముందే పెన్షన్ల పంపిణీ.

0
188

ఫిబ్రవరి నెల పింఛన్లు ఒక రోజు ముందుగానే పంపిణీ

ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు నగదు అందజేత

ఫిబ్రవరి 1న బడ్జెట్, ఆదివారం కావడంతో ప్రభుత్వ నిర్ణయం

ఈ నెల‌ 30నే సచివాలయాలకు నగదు విడుదల చేయ‌నున్న అధికారులు

ఏపీలోని పింఛనుదారులకు కూటమి ప్రభుత్వం తీపి క‌బురు చెప్పింది. ఎన్టీఆర్ భరోసా పథకం కింద ప్రతినెలా అందించే పింఛన్లను ఈసారి ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరి నెలకు సంబంధించిన పింఛను డబ్బులను ఈ నెల‌ 31వ తేదీనే లబ్ధిదారులకు అందజేయనుంది. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైన నగదును ఈ నెల‌ 30 నాటికే సచివాలయాలకు పంపించేందుకు చర్యలు చేపట్టారు.

 

సాధారణంగా ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేస్తారు. అయితే, ఈసారి ఫిబ్రవరి 1న రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. అదే రోజు ఆదివారం కూడా వచ్చింది. ఈ కారణాల వల్ల సచివాలయ ఉద్యోగులతో పింఛన్ల పంపిణీ చేయించడం ఇబ్బంది అవుతుందని భావించిన ప్రభుత్వం, ఒక రోజు ముందుగానే ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

 

పింఛన్ల పంపిణీ తేదీలను ఇలా మార్చడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా పలు సందర్భాల్లో ప్రభుత్వం ఒకటో తేదీకి ముందే పింఛన్లు పంపిణీ చేసింది. సాధారణంగా నెల మొదటి తేదీన సెలవు దినం వచ్చినప్పుడు, లబ్ధిదారుల సౌకర్యం కోసం ముందుగానే నగదు పంపిణీ చేస్తున్నారు. ఇటీవలే జనవరి 1న నూతన సంవత్సరం సెలవు కావడంతో డిసెంబర్ 31నే పింఛన్లు అందజేశారు. ఇప్పుడు అదే తరహాలో ఫిబ్రవరి నెల పింఛన్లను కూడా ముందుగానే పంపిణీ చేయాలని నిర్ణయించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ భారతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమాణ స్వీకారం చేసిన నారా లోకేష్ బాబుని అభినందించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొన్న...
By Benguluri Madhubabu 2026-04-29 14:03:01 0 302
Andhra Pradesh
60 మందికి బోటు మత్స్యకారులకు బోటు పత్రాలను అందజేసిన ఎమ్మెల్యే
*అరవై మంది మత్స్యకారులకు బోట్ రిజిస్ట్రేషన్ పత్రాలు అందించిన ఎమ్మెల్యే*   నాగాయలంక మండలం...
By Rajini Kumari 2026-04-10 12:03:29 0 181
Andhra Pradesh
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు.
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మంగళగిరి రూరల్ పీఎస్ లో కేసు నమోదు 03-02-2026 Tue 07:02 | Andhra...
By Pagadala Venkateswar 2026-02-03 07:03:40 0 197
Andhra Pradesh
Gurramkonda: అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గుర్రంకొండ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గురువారం గుర్రంకొండ పోలీస్...
By Pagadala Venkateswar 2026-07-10 06:28:46 0 163
Odisha
MMPY Expansion: Mid-Day Meals for Classes 9 and 10
The Odisha government has announced a significant expansion of the Mukhyamantri Poshan Yojana...
By Lokeshwari Panthadi 2026-07-02 07:31:10 0 154
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com