జనసేన నాయకుల మనవతా జనసేన నాయకుల మానవతా దృక్పథం

0
225

జనసేన నాయకుల మానవతా 

 

ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు కుటుంబానికి శ్రీ పంచకర్ల సందీప్ రూ. 50 వేలు, శ్రీ విశ్వక్ సేన్ రూ. 50 వేలు ఆర్థిక సహాయం 

 ఉపాధి కల్పించిన శాసనమండలి సభ్యులు, జనసేన ప్రధాన కార్యదర్శి శ్రీ Naga Babu గారు 

ఎచ్చెర్లలో హత్యకు గురైన జన సైనికుడు శ్రీ పుక్కాల రాజశేఖర్ కుటుంబానికి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులు, జనసేన భీమిలి నియోజకవర్గం ఇన్చార్జి డా.పంచకర్ల సందీప్ రూ.50 వేలు, ఎచ్చెర్ల నియోజకవర్గం పీఓసీ శ్రీ విశ్వక్ సేన్ రూ.50 వేలు మొత్తం రూ.1 లక్ష ఆర్థిక సహాయం అందజేయడం ద్వారా జనసేన నాయకుల మానవతా దృక్పథం మరోసారి నిరూపితమైంది. గణతంత్ర వేడుకల్లో పాల్గొనేందుకు సోమవారం ఎచ్చెర్ల ఎమ్మెల్సీ క్యాంప్ కార్యాలయంకు విచ్చేసిన శాసనమండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు సమక్షంలో చెక్కులను అందజేశారు. శ్రీ పుక్కాల రాజశేఖర్ సతీమణి శ్రీమతి హరిప్రియ ఇటీవల ఎచ్చెర్ల పర్యటనలో శ్రీ నాగబాబు గారిని కలిసి.. సంబంధం లేని ఘర్షణలో తన భర్తను హత్యచేశారని, కుటుంబ పోషణ భారంగా ఉన్నదని మొరపెట్టుకున్నారు. అప్పటికప్పుడు కొంత ఆర్థికసహాయం అందజేసిన శ్రీ నాగబాబు గారు ఉపాధి అవకాశం కల్పించారు. శ్రీమతి హరిప్రియ ఫిబ్రవరి నుంచి ఉద్యోగంలో చేరనున్నారు. మానవతా దృక్పథంతో జనసైనికుడు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన డాక్టర్ పంచకర్ల సందీప్, శ్రీ విశ్వక్ సేన్ లను శ్రీ కె. నాగబాబు గారు ప్రత్యేకంగా అభినందించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విజయనగరంలో కేజీ చేపలు రూ.150
ఆదివారం కావడంతో మాంసాహార ప్రియులు చికెన్, మటన్, చేపల దుకాణాల ముందు బారులు తీరారు.విజయనగరంలో...
By Boiena Rajesh 2026-04-26 04:47:12 0 240
Andhra Pradesh
స్వర్ణాంధ్ర లక్ష్య సాధనకు బడ్జెట్ 2026-27 పటిష్ట పునాది.
అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన బడ్జెట్ 2026-27 అవగాహన కార్యక్రమంలో మంత్రి బి....
By Pagadala Venkateswar 2026-03-31 03:25:14 0 198
Karnataka
Water Resource Management and Conservation in Karnataka
Karnataka is strengthening water resource management and conservation efforts to address growing...
By Fathima Safa 2026-06-17 06:38:24 0 158
Andhra Pradesh
ఏపీ ప్రజలకు శుభవార్త.. 25 సేవలు ఇంటి నుంచే, ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు.
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ప్రభుత్వం తీపికబురు చెప్పింది.. ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగే పని లేకుండా...
By John Baji 2026-02-05 11:15:19 0 609
Andhra Pradesh
బాలిక దారుణ హత్య : పోలీసుల అదుపులో నిందితుడు.
మదనపల్లె పట్టణంలో నీరుగట్టువారిపల్లి రామిరెడ్డి లే అవుట్‌లో బాలిక దారుణ హత్యకు గురైన...
By Pagadala Venkateswar 2026-02-17 06:14:12 0 205
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com