YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్.

0
218

YS Jagan: నేడు తాడేపల్లికి వైఎస్ జగన్

27-01-2026 Tue 10:48 | Andhra

YS Jagan to Arrive in Tadepalli Today

 

ఈ రోజు ఉదయం 11.50 గంటలకు బెంగళూరు నుంచి గన్నవరం చేరుకోనున్న జగన్

రోడ్డు మార్గంలో 12.30 గంటలకు తాడేపల్లి నివాసానికి 

రేపు నియోజకవర్గ నేతలతో సమీక్ష నిర్వహించనున్న జగన్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు బెంగళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం లక్ష్యంగా వారానికి ఒకరోజు నేతలు, కార్యకర్తలతో సమీక్ష నిర్వహించాలని ఇదివరకే నిర్ణయించిన వైఎస్ జగన్ గత బుధవారం ఏలూరు నియోజకవర్గ శ్రేణులతో సమావేశమయ్యారు. ఈ క్రమంలో రేపు బుధవారం కూడా నేతలు, కార్యకర్తలతో సమావేశం కానున్నారు.

 

ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం బెంగళూరు నుంచి విమానంలో బయలుదేరిన వైఎస్ జగన్ 11.50 గంటలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి 12.50 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి జగన్ చేరుకుంటారు. కాగా, ఈ రోజు సాయంత్రం ముఖ్య నేతలతో సమావేశమై వివిధ అంశాలపై చర్చించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. 

Search
Categories
Read More
Andhra Pradesh
Chandrababu Naidu: లోకేశ్ పని లోకేశ్ చేస్తున్నాడు... నా పని నేను చేస్తున్నా: సీఎం చంద్రబాబు.
పార్టీ ఎమ్మెల్యేలు, నాయకుల పనితీరును సమగ్రంగా విశ్లేషిస్తున్నామన్న సీఎం చంద్రబాబు  ...
By Pagadala Venkateswar 2026-02-15 06:23:40 0 202
SURAKSHA
Bengaluru Women Police Train Girls Self-Defense
 Bengaluru Women Police today conducted free self-defense training for college girls in...
By Kalaga Sailaja 2026-07-06 06:57:03 0 230
Odisha
Fuel Frenzy: Odisha Government Urges Calm Amid Price Hike
The capital city of Bhubaneswar and the holy town of Puri witnessed long queues at petrol pumps...
By Dunna Jessicaruth 2026-05-15 11:28:13 0 212
Telangana
బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’.. విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన.|
● పల్లవి స్కూల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ● మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించిన పోలీసులు...
By Sidhu Maroju 2026-08-19 11:59:39 0 139
Andhra Pradesh
నిజమైన అభివృద్ధి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తోనే సాధ్యం - ఎమ్మెల్యే కొండయ్య
చీరాల నియోజవర్గం చీరాల పట్టణం పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో చీరాల పట్టణ అధ్యక్షుడు సురేష్...
By Vadlamudi NagaVenkat 2026-04-20 05:32:15 0 283
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com