Bandla Ganesh: బండ్ల గణేశ్‌ను పరామర్శించిన మంత్రి నారా లోకేశ్.

0
214

సినీ నిర్మాత బండ్ల గణేశ్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ పరామర్శించారు. శ్రీవారి మొక్కు తీర్చుకునేందుకు తిరుమలకు పాదయాత్ర (సంకల్ప యాత్ర) చేపట్టిన బండ్ల గణేశ్ కాలి నొప్పి కారణంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న లోకేశ్ ఆయనతో ఫోన్‌లో మాట్లాడి పరామర్శించారు. పాదయాత్రలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించి త్వరగా కోలుకుని మొక్కు పూర్తి చేయాలని ఆకాంక్షించారు. 

 

వైసీపీ హయాంలో టీడీపీ అధినేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టైన సమయంలో తాను తిరుమల వెంకన్నకు మొక్కుకున్నానని బండ్ల గణేశ్ తెలిపారు. అనంతరం చంద్రబాబు జైలు నుంచి విడుదలై ఎన్నికల్లో విజయం సాధించి మరోసారి సీఎం పదవిని చేపట్టడంతో, ఆ మొక్కును తీర్చుకునేందుకే ఈ నెల 19న షాద్‌నగర్‌లోని తన నివాసం నుంచి బండ్ల గణేశ్ సంకల్ప యాత్ర పేరుతో పాదయాత్రను చేపట్టారు. 

 

కాలినడకన తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకొని మొక్కు తీర్చుకుంటానని ఆయన తెలిపారు. ప్రస్తుతం బండ్ల గణేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో బండ్ల గణేశ్‌కు మార్గమధ్యలో టీడీపీ అభిమానులు, నేతలు స్వాగతం పలుకుతూ మద్దతు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో లోకేశ్ ఫోన్ చేసి గణేశ్‌ను పరామర్శించారు. 

Search
Categories
Read More
Bharat Aawaz
🛕 Jagannath Ratha Yatra: The Divine Journey of Faith and Unity
Every year, millions of hearts beat in devotion as the grand chariots of Lord Jagannath, Lord...
By Bharat Aawaz 2025-06-27 07:39:28 0 2K
Chandigarh
Sector 26 Club Fire: A Wake-Up Call for Safety
Early this morning, a massive fire gutted a popular club in Chandigarh’s Sector 26, sending...
By Dunna Jessicaruth 2026-05-15 09:40:47 0 134
Andhra Pradesh
కొండపల్లి ఐడిఏ డ్రెస్ ఫ్యాక్టరీలో 200 కేజీల ఆల్ట్రా జోల స్వాధీనం
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *కొండపల్లి ఐడిఏ లో డ్రస్ ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున...
By Rajini Kumari 2026-03-13 13:50:17 0 211
Andhra Pradesh
పుంగనూరు: 200 కుటుంబాలకు రంజాన్ తోఫా కిట్లు పంపిణీ టూరు మురళి
పుంగనూరు పట్టణంలో నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి చల్లా బాబు ఆదేశాల మేరకు 200 పేద కుటుంబాలకు రంజాన్...
By Kothuru Murali 2026-03-20 06:02:48 0 197
Telangana
కార్పొరేషన్ లో కలిపారు సమస్యలను మరిచారు
‎దుండిగల్, మల్లంపేట మొన్న ,గ్రామపంచాయతీ, నిన్న మునిసిపాలిటీ, నేడు సైబ,రాబాద్ కార్పొరేషన్,ఇలా...
By Ponnala Srinivasrao 2026-03-01 06:29:46 0 663
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com