Chandrababu Naidu: మన్ కీ బాత్... ప్రధాని మోదీకి థాంక్స్ చెప్పిన సీఎం చంద్రబాబు

0
203

'మన్ కీ బాత్' కార్యక్రమంలో అనంతపురం ప్రజలను ప్రశంసించిన ప్రధాని మోదీ

జల వనరుల పునరుద్ధరణలో వారి కృషి అభినందనీయమన్న ప్రధాని

ప్రధాని ప్రశంసలపై హర్షం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు

జల భద్రత తమ స్వర్ణాంధ్ర విజన్‌లో భాగమని స్పష్టం చేసిన సీఎం

ఈ ప్రశంసలు తమకు మరింత ప్రేరణ ఇస్తాయని చంద్రబాబు వెల్లడి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా ప్రజల కృషిని ప్రత్యేకంగా ప్రస్తావించి, వారిని కొనియాడారు. జల సంరక్షణ కోసం వారు చేస్తున్న స్ఫూర్తిదాయక ప్రయత్నాలను అభినందించారు. ప్రధాని ప్రశంసలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.

 

ఈ ఏడాది తొలి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో భాగంగా ప్రధాని మోదీ ఆదివారం జాతినుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, "జల వనరుల పునరుద్ధరణ కోసం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్రజలు చేస్తున్న కృషి ఎంతో ప్రశంసనీయం" అని అన్నారు. వారి నిబద్ధతను, సామూహిక ప్రయత్నాలను కొనియాడారు. కరవు పీడిత ప్రాంతంలో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం అందరికీ ఆదర్శమని పేర్కొన్నారు.

 

ప్రధాని ప్రశంసలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. "గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ, అనంతపురం ప్రజల స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలను మీ 'మన్ కీ బాత్' కార్యక్రమంలో ప్రస్తావించినందుకు ధన్యవాదాలు" అని చంద్రబాబు పేర్కొన్నారు. జల భద్రత అనేది తమ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర విజన్'లో పొందుపరిచిన 'పది సూత్రాలలో' ఒక కీలకమైన అంశమని ఆయన గుర్తుచేశారు.

 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సంప్రదాయ నీటి నిర్వహణ పద్ధతులను సమర్థంగా అనుసంధానం చేస్తూ, రాష్ట్రంలో బలమైన జల సంరక్షణ మౌలిక సదుపాయాలను నిర్మించడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు, ప్రధాని నరేంద్ర మోదీ నుంచి వచ్చిన ఈ ప్రశంస మరింత ప్రేరణను, ప్రోత్సాహాన్ని అందిస్తుందని ఆయన వివరించారు. జల సంరక్షణ వంటి కీలకమైన అంశంపై ప్రధాని దృష్టి సారించడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. కరవు నివారణకు తాము చేపడుతున్న కార్యక్రమాలకు ఇది మరింత బలాన్నిస్తుందని అభిప్రాయపడ్డారు.

Search
Categories
Read More
Telangana
ఫోన్ కొట్టేసి... ఖాతా ఖాళి .!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో మొబైల్ దొంగలు రెచ్చిపోతున్నారు....
By Sidhu Maroju 2026-03-28 14:01:45 0 190
Andhra Pradesh
Madanapalle: ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి పాల్పడిన ముగ్గురిపై తాలూకా పోలీసులు 420 చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఒకే ఇంటి స్థలాన్ని పలువురికి విక్రయించి మోసానికి...
By Pagadala Venkateswar 2026-07-15 05:20:06 0 93
Telangana
సుమతీ ఐపీఎస్ ని వేధించిన పోకిరీలు...
దిల్సుఖ్ నగర్ లో మల్కాజ్గిరి సీపీ సుమతీ ఐపీఎస్ స్పెషల్ ఆపరేషన్. అర్ధరాత్రుళ్లు మహిళల పరిస్థితిని...
By Ponnala Srinivasrao 2026-05-07 01:59:17 0 186
Tamilnadu
యువత క్రీడల్లో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక ప్రోత్సాహకాలు అందిస్తోంది : బండారు కార్తీక రెడ్డి.
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : లాలాపేట్ :   తెలంగాణ ఓపెన్ చిల్డ్రన్స్ చెస్ టోర్ననెట్ 2025...
By Sidhu Maroju 2025-09-15 17:10:25 0 336
Telangana
మాజీ ఎమ్మెల్యే శ్రీ పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి గుండెపోటు
పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు భారత్ అవాజ్ న్యూస్:-26 జూలై వరంగల్ జిల్లా నర్సంపేట మాజీ...
By Gujile Ramu 2026-07-26 04:20:03 0 185
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com