ఘనంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం.|

0
234

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా :  దుండిగల్  అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం పురస్కరించుకొని హైదరాబాద్ జిల్లా పరిధిలోని హోమ్ ఫర్ ది డిజేబుల్ & ఏజ్డ్, లిటిల్ సిస్టర్స్ ఓల్డ్ ఏజ్ హోమ్, మిషనరీ ఆఫ్ చారిటీ మదర్ తెరిసా హోమ్, కు చెందిన 40 మంది వయోధికులను అలాగే పేద విద్యార్థులను ఆనందపరచడానికి వారు ఊహించని విధంగా ప్రత్యేక కార్యక్రమం కోసం గురువారం దుండిగల్ లోని కదిలే విమాన హోటల్‌ (ఫ్లైట్ రెస్టారెంట్ మూవింగ్ హోటల్) కు తీసుకువెళ్ళి. వయోధికులు, పేదపిల్లలు ఆనందంగా పాల్గొనే విధంగా చిన్న చిన్న ఆటలు, వినోదాత్మక కార్యక్రమాలు, పాటలు నిర్వహించారు. అనంతరం వయోధికులతో కేక్ కట్ చేయించి వారిని ఘనంగా శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమాలు వృద్ధులలో మానసిక ఉల్లాసాన్ని పెంచడంతో పాటు సామాజిక పరిచయాలు పెరిగేందుకు సహాయపడ్డాయి. తదుపరి, వారి అభిరుచిని దృష్టిలో ఉంచుకొని ఇష్టమైన ఆహార పదార్థాలను ప్రత్యేకంగా వడ్డించారు. ఈ సందర్భంగా వయోవృద్ధులు మాట్లాడుతూ...ఈ కార్యక్రమంలో పాల్గొనడం తమకెంతో ఆనందంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు ఈ సంతోషకరమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమం మొత్తం ముగిసిన తర్వాత, ప్రతి వయోధికుడినీ క్షేమంగా, గౌరవంతో తిరిగి ఆయా వృద్ధాశ్రమాలకు చేరవేయడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో, అలాగే సంకల్ప ఆర్గనైజేషన్, వసుంధర డైమండ్స్ వారి సహకారంతో విజయవంతంగా నిర్వహించబడింది. వృద్ధుల ఆనందం, సంతోషభావం, వారి ముఖాలపై కనిపించిన చిరునవ్వులు ఈ కార్యక్రమానికి నిజమైన విజయపతాకాన్ని అందించాయి.

Sidhumaroju

Search
Categories
Read More
Telangana
ప్రమాదవకరంగా ఏర్పడ్డ రాళ్లగుట్ట : పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్.|
    సికింద్రాబాద్ : మోండా డివిజన్ పరిధిలోని ఈస్ట్ మారేడ్ పల్లి వడ్డెర బస్తి ప్రాంతంలో...
By Sidhu Maroju 2025-11-03 12:25:31 0 296
Andhra Pradesh
అసాంఘిక కార్యకలాపాలపై విశ్వహిందూ పరిషత్ వినతిపత్రం.
అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో శనివారం విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో అసాంఘిక...
By Pagadala Venkateswar 2026-04-19 04:32:12 0 152
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : హల్చల్ చేసిన ఒంటరి ఏనుగు.
పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్ల మండలం, పాలెం పంచాయతీలో ఆదివారం పంట పొలాల్లో ఒంటరి ఏనుగు...
By Kothuru Murali 2026-01-25 12:02:46 0 230
BMA
Claim Denied by AI: Algorithms Reject Hospital Bills
Private health insurers are deploying automated decision-making engines to review and reject...
By JoinBMA 2026-08-25 07:23:39 0 200
Telangana
మనుషులను అతిగా నమ్మడమే పూరి గారి బలహీనత
సంగీత దర్శకుడు రఘు కుంచె మరియు డైరెక్టర్ పూరి జగన్నాథ్ గారి మధ్య ఉన్న అనుబంధం, ఆయన వ్యక్తిత్వం...
By Ponnala Srinivasrao 2026-04-04 12:27:46 0 315
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com