మున్సిపల్ ఉద్యోగులతో ఓటర్ల ప్రతిజ్ఞ చేయించిన కమిషనర్

0
197

కర్నూలు : 

ప్రతి ఓటు విలువైనదే..

• కర్నూలు నియోజకవర్గ ఆర్వో, కమిషనర్ పి.విశ్వనాథ్

ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారత్‌లో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, ఒక్క ఓటుతోనే ఎన్నికల్లో అభ్యర్థులు గెలుపొందిన సంఘటనలు ఎన్నో ఉన్నాయని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కమిషనర్ పి.విశ్వనాథ్ పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయాలంటే ప్రతి ఓటరు బాధ్యతగా తన ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. శుక్రవారం 16వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో ఉద్యోగులచే కమిషనర్ ఓటర్ల ప్రతిజ్ఞ చేయించారు. 

ఈ సందర్భంగా ఆర్వో మాట్లాడుతూ.. ఓటు హక్కు ప్రతి పౌరుడి హక్కు మాత్రమే కాక బాధ్యత సైతం అని, మతం, కులం, భాష, ఇతర ప్రలోభాలకు లోనుకాకుండా స్వేచ్ఛాయుతంగా, నైతికంగా ఓటు వేయడం ద్వారానే నిజమైన ప్రజాస్వామ్యం నిలబడుతుందని తెలిపారు. ఈ ఏడాది “నా భారత్, నా ఓటు” అనే నినాదంతో అనేక చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు నమోదు చేసుకుని, ప్రతి ఎన్నికలో చురుకుగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు స్వీప్ కార్యక్రమాలను వినియోగించుకోవాలని సూచించారు.

కార్యక్రమంలో మేనేజర్ చిన్నరాముడు, డిప్యూటీ తహశీల్దార్ ధనుంజయ, సూపరింటెండెంట్లు సుబ్బన్న, మంజూర్ బాష, నాగరాజు, సిబ్బంది షబానా బేగం, తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరులో ఈనెల 31న మున్సిపల్ సమావేశం
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 31న సాధారణ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని...
By Kothuru Murali 2026-01-27 09:29:40 0 177
Andhra Pradesh
మున్సిపల్ శాఖ మంత్రితో సమావేశమైన ఎమ్మెల్యేలు గది రామ్మోహన్ బోండా ఉమా సుజనా చౌదరి
*నగరాభివృద్థికి డీపీఆర్‌ సిద్ధమైన వెంటనే నిధులు* *మున్సిపల్‌ శాఖా మంత్రితో సమావేశమైన...
By Rajini Kumari 2026-01-13 16:30:03 0 200
Andhra Pradesh
మదనపల్లె మార్కెట్ కమిటీ కీలక నిర్ణయాలు: కొత్త యార్డ్ ఏర్పాటుకు ఆమోదం.
అన్నమయ్య జిల్లా మదనపల్లెలో, మార్కెట్ కమిటీ సమావేశంలో ఛైర్మన్ జంగాల శివరాం అధ్యక్షతన సోమవారం కీలక...
By Pagadala Venkateswar 2026-05-05 06:23:19 0 100
Andhra Pradesh
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Gadiyapudi Narendra 2025-12-28 16:21:23 0 266
Andhra Pradesh
మైనర్ బాలికపై లైంగిక దాడి, తల్లి ఆత్మహత్యాయత్నం.
అన్నమయ్య జిల్లా మొలకలచెరువు మండలం గూడుపల్లి గ్రామంలో 10 ఏళ్ల బాలికపై యువకుడు లైంగిక దాడికి...
By Pagadala Venkateswar 2026-03-23 04:02:04 0 179
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com