మున్సిపల్ శాఖ మంత్రితో సమావేశమైన ఎమ్మెల్యేలు గది రామ్మోహన్ బోండా ఉమా సుజనా చౌదరి

0
225

*నగరాభివృద్థికి డీపీఆర్‌ సిద్ధమైన వెంటనే నిధులు*

*మున్సిపల్‌ శాఖా మంత్రితో సమావేశమైన ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్,బొండా ఉమ, సుజనా చౌదరి*

***

 

అమరావతికి ముఖద్వారంగా ఉన్న విజయవాడ నగరాభివృద్థికి ఎన్ని వేల కోట్ల రూపాయాలు అయినా మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.  

 

ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో మున్సిపల్‌శాఖా మంత్రి పి.నారాయణతో నగరానికి చెందిన ఎమ్మెల్యేలు గద్దె రామమోహన్, బొండా ఉమామహేశ్వరరావు, సుజానా చౌదరి, బోడే ప్రసాద్‌లతో నగరాభివృద్థిపై మంగళవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో విజయవాడ నగర పాలక సంస్థ అధికారులు కూడా పాల్గొన్నారు. 

 

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ నగరాభివృద్థికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారన్నారు. విజయవాడ అభివృద్థికి చెన్నైకు చెందిన ఐఐటీ నిపుణులతో డీపీఆర్‌ సిద్ధం చేయిస్తున్నామన్నారు. విజయవాడ నగర వాసుల అవసరాలు అన్ని తీరే విధంగా డీపీఆర్‌న సిద్దం చేస్తున్నారన్నారు. నగరంలోని ఎక్కడ వంతెనలు నిర్మాణం చేయాలి, రహదారులు ఎక్కడ విస్తరించాలి, మరుగునీటి కాలువలు, ఆర్‌వోబీలు, ప్లై వోవర్ల నిర్మాణంతో పాటుగా స్ట్రామ్‌ వాటర్‌ డ్రైయిన్లు నిర్మాణాల గురించి ఈ డీపీఆర్‌లో ఉన్నాయన్నారు. ఇంకా పూర్తి స్థాయిలో ఈ డీపీఆర్‌ సిద్ధం కావడానికి కొంత సమయం పడుతుందని మున్సిపల్‌ అధికారులు తెలియజేశారన్నారు. ఈ విషయంపై మున్సిపల్‌ శాఖా మంత్రి పి.నారాయణ మాట్లాడుతూ డీపీఆర్‌ సిద్ధం అయిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు దృష్టికి తీసుకువెళ్ళి నిధులు మంజూరు అయ్యేలా చూస్తానని చెప్పారన్నారు. డీపీఆర్‌ సిద్ధం అయిన వెంటనే ఎన్ని నిధులు కావాలో అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. విజయవాడ అభివృద్థికి ఎన్ని వేల కోట్లు నిధులు అయినా మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు.

Search
Categories
Read More
Telangana
HNK: ఎటిఎంలో చోరీలు...... రాజస్థాన్ ముఠా అరెస్ట్
ఎటిఎం కేంద్రంలో  ఖాతాదరుల దృష్టి మర్చి చోరీలకు పాల్పడుతున్న రాజస్థాన్ కు చెందిన ఏడుగురు...
By Prashanth Goindla 2025-12-28 07:51:29 0 447
Telangana
పార్లమెంట్లో ఏ బిల్లు అయినా ఓటింగ్ తలుపులు మూసే చేస్తారు..CM రేవంత్ రెడ్డి
ఆంధ్ర, తెలంగాణ విభజన ఓటింగ్ తలుపులు మూసి చేశారని బుర్ర లేని వాళ్ళు అలా మాట్లాడతారు, లగడపాటి...
By Ponnala Srinivasrao 2026-04-19 01:30:39 0 143
Andhra Pradesh
కష్టపడి పని చేసే కార్యకర్తలకు గుర్తింపు: బొబ్బిలి ఎమ్మెల్యే
టీడీపీ కోసం కస్టపడి పనిచేసే కార్యకర్తలకు మంచి గుర్తింపు వస్తుందని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు....
By Boiena Rajesh 2026-03-29 23:16:42 0 247
Bharat Aawaz
Nelson Mandela International Day – July 18 A Day to Inspire Change, A Lifetime to Serve Humanity
Every year on July 18, the world unites to celebrate the birth and legacy of one of the...
By Citizen Rights Council 2025-07-17 18:52:56 0 2K
Telangana
బోయిన్‌పల్లిలో ‘అరైవ్ అలైవ్’.. విద్యార్థులకు ట్రాఫిక్ అవగాహన.|
● పల్లవి స్కూల్‌లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన ● మైనర్లు వాహనాలు నడపవద్దని సూచించిన పోలీసులు...
By Sidhu Maroju 2026-08-19 11:59:39 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com