Vijayasai Reddy: ఆ కోటరీని నమ్మితే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు: విజయసాయిరెడ్డి.

0
196

లిక్కర్ స్కాంలో ముగిసిన విజయసాయి రెడ్డి ఈడీ విచారణ

అనంతరం మీడియాతో మాట్లాడిన విజయసాయి

రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని స్పష్టం

జగన్ చుట్టూ ఉన్న కోటరీ వల్లే పార్టీకి నష్టమంటూ వ్యాఖ్య

తనపై చేసిన వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకోవాలని డిమాండ్

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ ఆరోపణల నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరైన వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన రాజకీయ భవిష్యత్తుపై కీలక ప్రకటన చేయడంతో పాటు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వారి వల్లే పార్టీకి ఈ దుస్థితి దాపురించిందని, ఆ కోటరీ మాటలు నమ్మితే జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని తేల్చిచెప్పారు.

 

గత ఏడాది రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన విజయసాయి రెడ్డి, ఆ నిర్ణయంపై యూ-టర్న్ తీసుకున్నారు. తాను రాజకీయాల నుంచి తప్పుకోవడం లేదని, జూన్ తర్వాత తన రాజకీయ భవిష్యత్ ప్రణాళికలను వెల్లడిస్తానని స్పష్టం చేశారు. లిక్కర్ స్కామ్ విచారణలో భాగంగా ఈడీ అధికారులు తనను ప్రశ్నించారని, అయితే అసలు ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగిందని తాను భావించడం లేదని అధికారులకు చెప్పినట్లు వెల్లడించారు. మిథున్ రెడ్డి కోరిక మేరకు శ్రీధర్ రెడ్డి కంపెనీకి సిఫారసు చేసిన మాట వాస్తవమేనని, కానీ రూ.100 కోట్లు ఏర్పాటు చేయాలని జగన్ తనతో ఎన్నడూ చెప్పలేదని ఆయన కుండబద్దలు కొట్టారు.

 

ఈ సందర్భంగా జగన్ చుట్టూ ఉన్న కోటరీపై విజయసాయి రెడ్డి తీవ్ర ఆగ్రహం, ఆవేదన వ్యక్తం చేశారు. "జగన్ చుట్టూ ఉన్న కోటరీ పెట్టే వేధింపులు, అవమానాలు తట్టుకోలేకపోయాను. ఆ కోటరీయే నన్ను పొగబెట్టి నెమ్మదిగా పార్టీ నుంచి బయటకు పంపించింది. కోటరీలోని కొందరు ఇప్పటికీ తింటూనే ఉన్నారు. జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని అంటిపెట్టుకుని ఉన్న నాకు ఇప్పుడు గౌరవం లేకుండా పోయింది. ఈ కోటరీ మాటలు నమ్మడం కొనసాగిస్తే జగన్ ఎప్పటికీ అధికారంలోకి రాలేరు" అని ఘాటుగా విమర్శించారు.

 

తాను 'నంబర్ 2' అనే మాట వాస్తవమేనని, కానీ, కేవలం తనపై కేసులు వచ్చినప్పుడు, వాటిని ఎదుర్కోవడానికి మాత్రమే తనను నంబర్ 2గా ప్రచారం చేశారని వాపోయారు. కానీ లాభాలు పంచుకోవడంలో మాత్రం తన స్థానం వంద తర్వాతనే అని అన్నారు. ఇక 'ప్రలోభాలకు లొంగిపోయారు' అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు తనను తీవ్రంగా బాధించాయని, ఆ వ్యాఖ్యలను జగన్ వెనక్కి తీసుకుంటేనే తదుపరి ఆలోచన ఉంటుందని షరతు విధించారు. 

 

టీడీపీ కూటమిని విడగొడితేనే జగన్‌కు మళ్లీ అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషణ చేశారు. తనకు విశాఖలో ఒక అపార్ట్‌మెంట్ తప్ప మరేమీ లేదని, ఏడాదిగా వ్యవసాయం చేసుకుంటున్నానని, సంబంధం లేని విషయాల్లో తనను ఇరికించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో పెను ప్రకంపనలు

Search
Categories
Read More
Andhra Pradesh
మదనపల్లిలో బ్యాంకు ఉద్యోగుల సమ్మె.
మదనపల్లిలో బ్యాంకు యూనియన్ల ఐక్యవేదిక (UFBU) పిలుపు మేరకు మంగళవారం బ్యాంకు ఉద్యోగులు సమ్మెలో...
By Pagadala Venkateswar 2026-01-28 10:22:04 0 168
Andhra Pradesh
జనసేన బలపడితేనే ప్రజల కలలు నెరవేరతాయి!
చౌడేపల్లిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీని ఘన విజయంతో గెలిపించి, తమ నాయకుడు...
By Kothuru Murali 2026-06-05 13:25:05 0 124
Entertainment
Ananya Panday's billowing anarkali by Rohit Bal
Ananya Panday's billowing anarkali by Rohit Bal is an ideal wedding guest look. The actor...
By Bharat Aawaz 2025-07-03 07:53:55 0 2K
Andhra Pradesh
Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.
Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు...
By Pagadala Venkateswar 2026-07-18 06:57:23 0 87
Telangana
పెద్దపల్లి : ఉప ముఖ్యమంత్రిని కలిసిన MLA ...!
ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు హైదరాబాద్లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్...
By Sunka Santhosh 2026-06-18 19:03:50 0 174
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com