Nara Lokesh: రేపు నారా లోకేశ్ పుట్టినరోజు... సీడీపీ విడుదల చేసిన తెలుగుదేశం పార్టీ.

0
339

జనవరి 23న మంత్రి నారా లోకేశ్ పుట్టినరోజు

ఈ సందర్భంగా ఆయన బర్త్ డే సీడీపీని పంచుకున్న టీడీపీ

లోకేశ్ పుట్టినరోజు వేడుకలకు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాట్లు

ఆంధ్రప్రదేశ్ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు పుట్టినరోజు జరుపుకుంటున్న సందర్భంగా పార్టీ ఆయన కామన్ డిస్‌ప్లే పిక్చర్ (సీడీపీ)ను విడుదల చేసింది. జనవరి 23న లోకేశ్ జన్మదినాన్ని పురస్కరించుకుని టీడీపీ శ్రేణులు, ఆయన అభిమానులు సోషల్ మీడియాలో ఈ సీడీపీని విస్తృతంగా షేర్ చేస్తున్నారు.

 

ప్రస్తుతం లోకేశ్ రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యా శాఖల మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా ఆయన క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు.

 

లోకేశ్ పుట్టినరోజు సందర్భంగా రేపు రాష్ట్రవ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు, వేడుకలు నిర్వహించేందుకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సీడీపీ విడుదలతో ఒకరోజు ముందుగానే సోషల్ మీడియాలో పుట్టినరోజు సందడి మొదలైంది. "యువ, డైనమిక్ నాయకుడు నారా లోకేశ్ పుట్టినరోజు సీడీపీని పంచుకోవడం సంతోషంగా ఉంది" అని తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొంది.

Search
Categories
Read More
Andhra Pradesh
నాయుడు కాలనీలో మొక్కలు నాటిన బేబినాయన
మాజీమంత్రి వాసిరెడ్డి కృష్ణమూర్తినాయుడు జయంతి సందర్భంగా ఆదివారం బొబ్బిలిలోని నాయుడుకాలనీలో...
By Boiena Rajesh 2026-08-16 10:12:16 0 112
Andhra Pradesh
రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని RPSF రాష్ట్ర కార్యదర్శి షాహిద్ ఆఫ్రిద్ డిమాండ్ చేశారు
రాయలసీమ యూనివర్సిటీ లో అవినీతి అక్రమాలు పాల్పడుతున్న వీసీ మరియు రిజిస్టర్ పై సమగ్రమైన విచారణ...
By Boya Dasthagiri 2026-06-14 03:25:37 0 185
Bharat Aawaz
Former Jharkhand CM Shibu Soren Passes Away=he also fought for Seperate Jharkhand State
Ranchi / New Delhi, August 4, 2025Veteran tribal leader and former Jharkhand Chief Minister Shibu...
By Bharat Aawaz 2025-08-04 04:48:51 0 1K
Andhra Pradesh
డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం
*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*   *పోలియో డే...
By Rajini Kumari 2025-12-18 11:20:44 0 267
SURAKSHA
Rajasthan Police Launch Dedicated Cyber Crime Cells
In response to the sharp rise in digital threats, the Rajasthan Police have established dedicated...
By Lokeshwari Panthadi 2026-07-04 08:20:24 0 82
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com