డిసెంబర్ 21వ తేదీన పోలియో డేను విజయవంతం చేద్దాం

0
266

*' డిసెంబర్ 21' పోలియో డేను విజయవంతం చేద్దాం:ఎమ్మెల్యేలు వెనిగండ్ల,వర్ల*

 

*పోలియో డే ప్రచార పోస్టర్లు ఆవిష్కరించిన...ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వరల కుమార్ రాజా*

 

*అవగాహన లేమితో చేసే చిన్న పొరపాటు.... పసిపిల్లల జీవితానికి శాపం కావొద్దు: ఎమ్మెల్యేలు*

 

*100% చిన్నారులకు చుక్కలు వేయించి.... పోలియోపై మరోసారి విజయం సాధిద్దాం: ఎమ్మెల్యేలు*

 

గుడివాడ డిసెంబర్ 18: ఈనెల 21వ తేదీన జరిగే పోలియో డేను అందరం కలిసి విజయవంతం చేద్దామని గుడివాడ పామర్రు ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము, వర్ల కుమార్ రాజాలు ప్రజానీకానికి పిలుపునిచ్చారు. అవగాహన లేమితో చేసే చిన్న పొరపాట్లు పసి పిల్లల జీవితానికి శాపం కాకూడదని ఎమ్మెల్యేలు అన్నారు.

 

గుడివాడ టిడిపి కార్యాలయం ప్రజా వేదికలో గురువారం మధ్యాహ్నం నిర్వహించిన కార్యక్రమంలో.... పోలియో డే ప్రచార పోస్టర్లను ఎమ్మెల్యేలు రాము, కుమార్ రాజా ఆవిష్కరించారు. పోలియో డే విజయ వంతానికి చేస్తున్న ఏర్పాట్లను వైద్య అధికారులు ఎమ్మెల్యేలకు వివరించారు.

 

అనంతరం ఎమ్మెల్యేలు వెనిగండ్ల రాము,వర్ల కుమార్ రాజాలు మీడియాతో మాట్లాడారు..... గుడివాడ, పామర్రు నియోజకవర్గాల ప్రజలందరూ పోలియో డే సందర్భంగా ఈనెల 21వ తేదీన తమ సమీప ప్రాంతాల్లో ఏర్పాటు చేసే పోలియో బూత్ లలో ఐదేళ్ల లోపు చిన్నారులు అందరికీ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయించాలని విజ్ఞప్తి చేశారు.

 

పోలియోపై నిరంతర విజయం పేరుతో ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పోలియో డే కార్యక్రమాలను మనందరం కలిసి విజయవంతం చేద్దామని ఎమ్మెల్యేలు పిలుపునిచ్చారు. అధికారులతో పాటుగా, కూటమి శ్రేణులు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలకు అవగాహన కల్పించి చిన్నారులు పోలియో చుక్కలు వేయించుకునేలా కృషి చేయాలన్నారు.

 

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఎస్ మనోహర్,మెడికల్ ఆఫీసర్ సురేష్, జనసేన ఇన్చార్జి బూరగడ్డ శ్రీకాంత్, గుడివాడ మార్కెట్ యార్డ్ చైర్మన్ చాట్రగడ్డ రవికుమార్, టిడిపి నాయకులు చాట్ల రమేష్, మున్సిపల్ ఎంఈ ప్రసాద్, డాక్టర్ శ్వేత,ఎంవి ప్రసాద్,రోటరీ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు వై.నాగేశ్వరరావు, కార్యదర్శి కిరణ్ బాబు,ఏఎన్ఎం, ఆశ వర్కర్స్, మున్సిపల్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
భారీ జన సందోహం మధ్య విజయోత్సవ సభకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు భారీ బైక్ ర్యాలీ
మంత్రి మండిపల్లి సారథ్యంలో కూటమి విజయోత్సవ సభకు పోటెత్తిన కార్యకర్తలు టిడిపి శ్రేణులను ముందుంది...
By Benguluri Madhubabu 2026-06-20 09:54:23 0 171
Telangana
నిజామాబాద్
తొలి ఏకాదశి సందర్భంగా మా 50 వ డివిజన్ లో ఉన్న శ్రీ విఠలేశ్వర దేవాలయానికి విచ్చేసిన ప్రియతమ అర్బన్...
By Sadaq Sadaq 2026-07-25 08:11:40 0 118
Andhra Pradesh
అన్నమయ్య జిల్లా: నిజాయితీ చాటుకున్న 108 సిబ్బంది.
సత్యసాయి జిల్లాకు చెందిన రైతు రెడ్డెప్ప రెడ్డి బి. కొత్తకోటలో ఎర్రగడ్డల డబ్బు వసూలు చేసుకొని...
By Pagadala Venkateswar 2026-06-01 04:35:05 0 142
Andhra Pradesh
స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోందా కురసాల కన్నబాబు
స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో ఏదో కుట్ర జరుగుతుందని కార్మికులు భావిస్తున్నారు 10,000 మందిని తొలగించి...
By Rajini Kumari 2026-06-09 12:44:59 0 403
Andhra Pradesh
మదనపల్లి: బాలిక అదృశ్యం – తల్లిదండ్రుల ఫిర్యాదు.
మదనపల్లిలో సోమవారం ఏడేళ్ల బాలిక రుచిక ప్రియా అదృశ్యమైంది. నీరుగట్టుపల్లిలో నివాసం ఉంటున్న...
By Pagadala Venkateswar 2026-02-17 05:15:09 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com