విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు.

0
239
బాపట్ల: విద్యార్థుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యమని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు. బాపట్లలోని ప్రభుత్వ ఎస్సీ, సమీకృత ఎస్టీ బాలికల వసతి గృహాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎస్సీ వసతి గృహంలో వసతులు, భోజన నాణ్యత, నీటి సరఫరా, క్రీడా కిట్లు తదితరాలను పరిశీలించారు. ఎస్టీ వసతి గృహంలో అపరిశుభ్రతపై అసహనం వ్యక్తం చేసి, మెనూ అమలు, భోజన నాణ్యత, సిబ్బంది పర్యవేక్షణపై ఆరా తీశారు. వసతి గృహాలను పరిశుభ్రంగా ఉంచాలని, ట్యూటర్ నియామకం, దోమల మెష్, ప్రహరీ గోడ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ పాఠశాలలు, వైద్యశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనను మరింత సమర్థవంతంగా చేపట్టేందుకు జిల్లాలో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి.వినోద్ కుమార్, ఐ.ఏ.ఎస్., గారు తెలిపారు. బుధవారం జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ, ప్రభుత్వ అధికారులు అవసరమైన ఫర్నిచర్, కంప్యూటర్లు, కుర్చీలు, ప్రింటర్లు వంటి వివరాలను ఈ వెబ్‌సైట్‌లో నమోదు చేయాలని సూచించారు. ఆ వివరాల ఆధారంగా దాతలు సహకరించవచ్చని తెలిపారు.
ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రభుత్వ వైద్యశాలల్లో అవసరమైన వసతుల కల్పనకు ఈ వెబ్‌సైట్ కీలకంగా మారుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలకు, ముఖ్యంగా పేద విద్యార్థులకు నేరుగా లాభం చేకూరేలా ఈ వ్యవస్థ పనిచేస్తుందని చెప్పారు.
 
#Narendra
Search
Categories
Read More
Telangana
నిజామాబాద్
ఒక ఫోటో వేల మాటలు చెప్పగలదు.. * ఫోటో జార్నలిస్టుల సేవలు అమోఘం... * " ప్రపంచ ఫోటో గ్రఫీ డే" లో...
By Sadaq Sadaq 2026-08-19 15:03:25 0 130
Andhra Pradesh
కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన
*కర్ణాటకలో మంత్రి నారా లోకేష్ పర్యటన*   *సింధనూరులో స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహాన్ని...
By Rajini Kumari 2026-04-04 15:01:06 0 277
Andhra Pradesh
దాడికి గురైన బాధితుడు తరుపున అండగా నిలబడ్డ బి సి నాయకులు... దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్
కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో డిసెంబర్ 31వ తేదీ రాత్రి...
By BABJI DADALA 2026-01-07 15:17:01 0 352
Andhra Pradesh
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం
ఆర్టీసీ అద్దె బస్సులు సమ్మెకు సిద్ధం బాపట్ల జిల్లా చీరాల: బాపట్ల జిల్లా చీరాల లో ఆంధ్రప్రదేశ్...
By Gadiyapudi Narendra 2026-01-08 12:17:31 0 346
Telangana
పలుకూరు యువకుల హైటెక్ మోసం
పలుకూరు యువకుల హైటెక్ మోసం కందుకూరు మండలం పలుకూరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు హైదరాబాద్...
By Thalakayala Nagashiva 2026-05-05 06:14:32 0 336
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com