Jayasanthi: విజయవాడలో హోంమంత్రి అనితను కుటుంబసమేతంగా కలిసిన కానిస్టేబుల్ జయశాంతి.

0
198

మహిళా కానిస్టేబుల్ జయశాంతిని సత్కరించిన హోంమంత్రి అనిత

సంక్రాంతి వేళ అంబులెన్స్‌కు దారి కల్పించిన వైనం

విజయవాడ క్యాంప్ కార్యాలయంలో కుటుంబసభ్యులతో కలిసి సన్మానం

పోలీస్ కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ

 

ఇటీవల రద్దీగా ఉన్న రోడ్డుపై, చేతిలో చంటిబిడ్డతో ట్రాఫిక్ క్లియర్ చేసి అంకితభావం ప్రదర్శించిన మహిళా కానిస్టేబుల్ జయశాంతిని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత అభినందించి, సత్కరించారు. గురువారం విజయవాడలోని తన క్యాంప్ కార్యాలయంలో జయశాంతిని, ఆమె కుటుంబసభ్యులను మంత్రి స్వయంగా కలిసి ఈ సత్కారం చేశారు.

 

గత సంక్రాంతి పండుగ సమయంలో కాకినాడ కెనాల్ రోడ్డుపై జయశాంతి చేసిన పని అందరి ప్రశంసలు అందుకుంది. చేతిలో చంటిబిడ్డతో ఉంటూనే ట్రాఫిక్‌ను నియంత్రిస్తూ, ఓ అంబులెన్స్‌కు దారి సుగమం చేసేందుకు ఆమె కృషి చేశారు. పైగా, ఆ రోజు ఆమె డ్యూటీలో లేరు. అయినప్పటికీ సామాజిక బాధ్యతతో ట్రాఫిక్ క్లియర్ చేశారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో, మంత్రి అనిత స్వయంగా జయశాంతికి ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. ఆ సంభాషణలోనే మంత్రిని కలవాలన్న తన ఆకాంక్షను జయశాంతి వ్యక్తం చేయగా, తాజాగా ఆ కోరికను నెరవేర్చారు.

 

 

 

ఈ సందర్భంగా మంత్రి అనిత స్పందిస్తూ "విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసే మన పోలీస్ సోదరీమణుల పట్ల నాకు ఎప్పుడూ ప్రత్యేక గౌరవం ఉంటుంది" అని అన్నారు. రాష్ట్ర రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న ప్రతి పోలీస్ కుటుంబానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆమె భరోసా ఇచ్చారు. ఈ మేరకు కానిస్టేబుల్ జయశాంతిని కలిసినప్పటి ఫొటోలను కూడా హోంమంత్రి అనిత పంచుకున్నారు.

Search
Categories
Read More
Telangana
బైరం చెరువుకు రక్షణ కవచం నిర్మించాలి- ప్రజావాణిలో వినతి.|
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : బాచుపల్లి పరిధిలోని బైరం చెరువు (పెద్ద చెరువు)...
By Sidhu Maroju 2025-12-29 15:46:07 0 237
Telangana
నిజామాబాద్:
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ధన్ పాల్ సూర్యనారాయణ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు....
By Sadaq Sadaq 2026-05-13 04:16:07 0 159
Andhra Pradesh
టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్
*Press Release*   *టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*...
By Rajini Kumari 2026-03-24 12:03:26 0 272
Gujarat
Gujarat Strengthens Sports Development Across the State
Gujarat continues to expand its sports ecosystem through investments in modern infrastructure,...
By Fathima Safa 2026-07-02 09:23:45 0 139
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com