టిడిపి కేంద్ర కార్యాలయంలో నారా లోకేష్ ప్రజా దర్బార్

0
271

*Press Release*

 

*టీడీపీ కేంద్ర కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్*

 

*ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరణ*

 

*సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ*

 

మంగళగిరి: మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ 85వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. మంత్రి నారా లోకేష్ ను కలిసి సమస్యలు విన్నవించేందుకు వివిధ జిల్లాల నుంచి ప్రజలు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. ప్రతిఒక్కరినీ ఆప్యాయంగా పలకరించిన మంత్రి లోకేష్.. వివిధ సమస్యలపై వారి నుంచి అర్జీలు స్వీకరించారు. రాష్ట్రంలో కేబుల్ ఆపరేటర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఏపీ ఫైబర్ నెట్ లో కాలం తీరిన బాక్స్ లకు 59 రూపాయల రెంటల్ ను తొలగించాలని ఏపీ కేబుల్ ఆపరేటర్స్ జేఏసీ ప్రతినిధులు మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. సమస్యను సంబంధిత మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషిచేస్తానని మంత్రి లోకేష్ వారికి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా పెదకాకాని మండలం అనుమర్లపూడిలో తన 0.81 ఎకరాల భూమిని ఆన్ లైన్ లో నమోదుకు తగిన చర్యలు తీసుకోవాలని గ్రామానికి చెందిన ముత్తే సాంబశివరావు కోరారు. రాష్ట్రంలో న్యాయవాదుల సమస్యలు పరిష్కరించాలని, న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని త్వరితగతిన అమల్లోకి తీసుకురావాలని ఏలూరుకు చెందిన నిమ్మల జ్యోతి కుమార్ మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. విజయవాడ మొగల్రాజపురంలోని తమ ఖాళీ స్థలానికి సంబంధించి వేరొక వ్యక్తి పేరుపై అక్రమంగా ఇంటి పన్ను విధించిన అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు సదరు పన్నును రద్దుచేసి న్యాయం చేయాలని గూడపాటి కోటేశ్వరరావు కోరారు. ఆయా వినతులను పరిశీలించి సమస్యల పరిష్కారానికి కృషిచేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.

*****

Search
Categories
Read More
Andhra Pradesh
జై కిసాన్ స్కీమ్ విజేతలకు బహుమతులు పంపిణీ.
మదనపల్లి: రామసముద్రం టిటిడి కళ్యాణ మండపంలో శుక్రవారం జై కిసాన్ జంక్షన్ ఆధ్వర్యంలో లక్కీ డిప్...
By Pagadala Venkateswar 2026-02-28 06:19:22 0 163
Andhra Pradesh
ప్రపంచంలో ఎక్కడ జరగని ఊహించని పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో కూడా ఊహించలేరు నీచులైన పోలీసులు ఉన్న ఎలాంటి శ్రేష్టాలు చేస్తారని భావించలేం
🚨 ప్రపంచంలో ఎక్కడా జరగని ఊహించని అత్యంత నీచమైన ఘోరమిది. నేరమిది. పోలీసులు ఇలా చేస్తారని కూడా కలలో...
By Chennaiah Kati 2026-06-22 05:59:42 0 134
Uttarkhand
Uttarakhand Accelerates Smart City Infrastructure Growth
Uttarakhand continues to advance smart city and urban infrastructure development in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:02:41 0 69
Andhra Pradesh
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యం: MLA
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్యంగా ఉంటామని ఎమ్మెల్యే బేబినాయన అన్నారు. బొబ్బిలి ఉపఖజానా...
By Boiena Rajesh 2026-04-28 03:06:55 0 265
Andhra Pradesh
పుంగనూరు:ముగ్గురికి రెండేళ్ల జైలు శిక్ష విధించిన కోర్టు
ఎర్రచందనం కేసులో తిరుపతి స్పెషల్ రెడ్ శాండిల్ కోర్టు నిందితులకు రెండేళ్ల జైలు శిక్ష విధించినట్లు...
By Kothuru Murali 2026-03-14 08:30:58 0 186
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com