గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.

0
255

🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, గుంటూరు ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ బెల్లం శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో,

గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ సీఐ శ్రీ ఏ. అశోక్ కుమార్ గారు మరియు వెస్ట్ ట్రాఫిక్ సీఐ శ్రీ సింగయ్య గారు తమ సిబ్బందితో కలిసి గుంటూరు నగర పరిధిలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.

📍ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వాహనదారులను గౌరవ న్యాయస్థానంలో హాజరుపరచగా, గౌరవ న్యాయమూర్తులు క్రింది విధంగా తీర్పులు వెలువరించారు.

📌 గుంటూరు ఈస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు.

* మొత్తం పట్టుబడిన వాహనదారులు:11 మంది.

* ద్విచక్ర వాహనదారులు: 8 మంది.

* 1 వ్యక్తికి రూ. 10,000/- జరిమానా.

* 7 మందికి ఒక్కొక్కరికి రూ. 5,000/- జరిమానా

(మొత్తం జరిమానా మొత్తం : రూ. 45,000/-)

* మద్యం సేవించి వాహనం నడిపిన 3 మందికి 3 రోజుల చొప్పున జైలు శిక్ష విధించబడింది.

📌గుంటూరు వెస్ట్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో డ్రంగ్ అండ్ డ్రైవ్ లో పట్టుబడిన వారు.

* మొత్తం పట్టుబడిన వాహనదారులు : 6 మంది.

* 3 మందికి ఒక్కొక్కరికి రూ. 7,000/- చొప్పున జరిమానా.

* 2 మందికి ఒక్కొక్కరికి రూ. 5,000/- చొప్పున జరిమానా

(మొత్తం జరిమానా మొత్తం : రూ. 31,000/-)

* 1 వ్యక్తికి 3 రోజులు జైలు శిక్ష విధించబడింది.

* మొత్తం పట్టుబడిన వాహనదారులు: 17 మంది.

* మొత్తం విధించిన జరిమానా: 13 మందికి రూ. 76,000/-

* మొత్తం జైలు శిక్షలు: 4 మంది

👉 ప్రజలు తమ భద్రత దృష్ట్యా ట్రాఫిక్ నిబంధనలు తప్పకుండా పాటించాలని, మద్యం సేవించి వాహనాలు నడపడం వాహనాలు నడిపిన వారికే కాకుండా, తోటి వాహనదారులకు కూడా ప్రమాదకరంగా ఉంటుందని, ఇటువంటి ఘటనలపై ఇకముందు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని గుంటూరు జిల్లా ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు.

Search
Categories
Read More
Andhra Pradesh
నార్పాల:ఖాళీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం
నార్పల కస్తూరిబా పాటషాలలో ఖాళీ గా ఉన్న భోధన భోధనేతరా ఉద్యోగ  దారఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు...
By Eslavath RameshNaik 2026-01-12 15:21:26 0 392
Andhra Pradesh
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పరిగి పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎస్పీ గారు
రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా...
By Chennaiah Kati 2026-06-22 16:48:16 0 93
Andhra Pradesh
సింగిల్ నంబర్ ఆట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న టాస్క్ పోలీసులు.
📍గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్ ఐపిఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో చట్ట వ్యతిరేక...
By John Baji 2026-01-03 02:09:22 0 247
Andhra Pradesh
పోలీసుల కళ్లు గప్పి 8 నెలలుగా తప్పించుకున్న యువకుడు.
మాదకద్రవ్యాల వ్యాపారం కేసులో గత 8 నెలలుగా పోలీసులకు చిక్కకుండా తప్పించుకుని తిరుగుతున్న యువకుడు...
By SivaNagendra Annapareddy 2026-06-12 13:53:02 0 302
SURAKSHA
Karnataka Police Green Drive Plants Thousands of Trees Every Year
 Karnataka Police contributes to environment through massive tree plantation drives....
By Kalaga Sailaja 2026-07-01 11:58:49 0 266
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com