ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి మంత్రి ప్రత్యేక చొరవ చూపాలి

0
626

టీయూడబ్ల్యూజే (ఐజేయు) సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్                                                                                                                                                                          మహబూబాబాద్ :::తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్, ఐజేయు కొత్తగూడ మండల కమిటీ  ఆధ్వర్యంలో కొత్తగూడ మండలంలోని గుంజేడు ముసలమ్మ తల్లి దేవస్థానం ప్రాంగణంలో మండల అధ్యక్షుడు ఎస్.కె. సల్మాన్ పాషా అధ్యక్షతన   బుధవారం సభ్యత్వాల పునరుద్ధరణ మరియు నూతన సభ్యత్వాల నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యులు దూలం శ్రీనివాస్,  జిల్లా అధ్యక్షుడు శ్రీ చిత్తనూరి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ గాడిపెళ్లి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు చిత్తనూరి శ్రీనివాస్ మాట్లాడుతూ....., జర్నలిస్టుల ఐక్యతే యూనియన్ బలోపేతానికి మూలమని అన్నారు. ప్రతి జర్నలిస్టు యూనియన్ సభ్యత్వాన్ని పునరుద్ధరించుకోవడంతో పాటు కొత్తగా అర్హులైన జర్నలిస్టులు సభ్యత్వం పొందాలని సూచించారు. యూనియన్ ఆధ్వర్యంలో జర్నలిస్టుల హక్కుల పరిరక్షణ, సంక్షేమం కోసం నిరంతరం కృషి కొనసాగుతుందని తెలిపారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు అనేక ఇబ్బందులు, మౌలిక సదుపాయాల కొరత, రవాణా సమస్యలు, వృత్తిపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ఏజెన్సీ ప్రాంత ముద్దుబిడ్డ, రాష్ట్ర మంత్రి శ్రీమతి సీతక్క ఈ అంశంపై ప్రత్యేక చొరవ చూపి, ఏజెన్సీ ప్రాంత జర్నలిస్టుల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్నందున వారి సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. అనంతరం సభ్యులందరూ సభ్యత్వాల పునరుద్ధరణతో పాటు కొత్త సభ్యత్వాల నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో యూనియన్ బలోపేతం, సభ్యుల ఐక్యత, జర్నలిస్టుల సంక్షేమం కోసం జిల్లా కమిటీ చేపట్టే కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించాలని సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ఉమ్మగాని మధు,రమణ, సత్యనారాయణ, కోరే పాపన్న, రావూరి ప్రశాంత్, పాలడుగు శ్రీధర్, జంగాల వినయ్ కుమార్, మహమ్మద్ అజ్మీర్, శెట్టి పరశురాములు, మండల ఉపాధ్యక్షులు విజయ్ కుమార్, వెంకటేశ్వర్లు, మండల ముఖ్య సలహాదారులు సునీల్, ప్రచార కార్యదర్శులు ఉబ్బని శ్రీహరి, తీగల ప్రేమ్ సాగర్, రాకేష్ వర్మ, చాపల శ్రీనివాస్, నాంపల్లి రాజ్ కుమార్, వాసం వెంకటేష్, తాటి సుదర్శన్, బిక్షపతి, యూనియన్ నాయకులు, మండల ప్రతినిధులు, సభ్యులు  పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ విజయవాడ, విజయవాడ, తేది : 18...
By Rajini Kumari 2025-12-18 11:51:54 0 235
Telangana
రాజాపేట మండల MROగా జి రవి కిరణ్ కుమార్
రాజాపేట భారత్ ఆవాజ్ న్యూస్ జూన్ 23 పారదర్శక సేవలు అందిస్తా యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల...
By Pindikura Mahesh 2026-06-23 17:34:32 0 149
SURAKSHA
The Guardian of Peace: The Transformative Journey of Ake Ravi Krishna, IPS
Beyond the Badge: How One Officer Is Healing Society Through Empathy and Action In the corridors...
By Kalaga Sailaja 2026-07-13 11:40:10 0 195
Andhra Pradesh
పోలవరం ప్రాజెక్టులోPPA బృందం పర్యటన
*పోలవరం ప్రాజెక్ట్ లో పీ పీ ఏ బృందం పర్యటన*    ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పరిశీలిస్తున్న...
By Rajini Kumari 2025-12-24 08:03:24 0 226
Andhra Pradesh
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి
సోలార్ పెట్టించుకోండి కరెంట్ బిల్ తగ్గించుకోండి  రోజురోజుకీ పెరిగిపోతున్న బిల్లుల కారణంగా...
By Thokala Sivaji 2026-04-16 06:29:25 0 395
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com