జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవ మహిళ 18 ఏళ్ల నరకయాతనకు విముక్తి

0
192

ఏలూరు జిల్లా 

 

జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవ.. మహిళ 18 ఏళ్ల నరకయాతనకు విముక్తి..

 

పనికోసం మలేషియా వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తాడేపల్లిగూడెం మహిళకు ఎట్టకేలకు విముక్తి లభించింది. వెంకటరమణ అనే మహిళ సుమారుగా 18 ఏళ్ల కిందట పనికోసం మలేషియా వెళ్లారు. అయితే అక్కడే చిక్కుకుపోయారు. అక్కడి యజమానులు పాస్‌పోర్టు తీసుకుని వెనక్కి రానీయకుండా ఇన్నేళ్లపాటు వెట్టిచాకిరీ చేయించుకున్నారు. అయితే తాడేపల్లిగూడెం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చొరవతో ఆమె 18 ఏళ్ల తర్వాత సొంతూరికి చేరుకున్నారు. మలేషియాలోని జనసేన ఎన్ఆర్ఐల సహకారంతో ఆమెను సొంతూరికి తీసుకొచ్చారు బొలిశెట్టి..

తాడేపల్లిగూడెం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. ఉపాధి కోసం పొట్ట చేతపట్టుకుని విదేశాలకు వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన ఓ మహిళను సుమారు 18 ఏళ్ల తర్వాత సొంతూరికి చేర్చారు. మలేసియాలో 18 ఏళ్ల పాటు నరకయాతన అనుభవించిన మహిళకు.. ఆ వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించారు.బ్రతుకుతెరువు కోసం వెళ్లి అక్కడే చిక్కుకుపోయిన తాడేపల్లిగూడెం మహిళను, మలేషియాలోని జనసైనికుల సహకారంతో వెతికి, చట్టపరమైన సమస్యలు పరిష్కరించి, ఆమెను తన కుమారులతో కలిసి సురక్షితంగా సొంతూరు తీసుకొచ్చారు.

 

దీనికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. తాడేపల్లిగూడెనికి చెందిన కుప్పు వెంకటరమణ అనే మహిళ 18 ఏళ్ల క్రితం పనికోసం మలేషియా వెళ్లారు. అయితే అక్కడకు వెళ్లిన తర్వాత ఆమెకు ఊహించని పరిస్థితులు ఎదురయ్యాయి. అక్కడి యజమానులు ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు. సొంతూరికి తిరిగి వెళ్దామంటే పాస్‌పోర్టు తీసుకుని భారతదేశానికి మళ్లీ రాకుండా అక్కడే నిర్భంధించారు.

దీంతో ఇన్నేళ్లుగా వెంకటరమణ అక్కడే వెట్టిచాకిరీ చేస్తూ నరకయాతన అనుభవించారు. అయితే తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ‌కు ఈ విషయం తెలిసింది. దీంతో మలేషియాలోని ఎన్ఆర్ఐ జనసైనికుల ద్వారా వెంకటరమణను సొంతూరు చేర్చారు. సొంత ఖర్చులతో ఆమెను ఇంటికి చేర్చారు. దీంతో మహిళ కుటుంబసభ్యులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన పనికి నెటిజన్లు కూడా అభినందిస్తున్నారు.

మరోవైపు జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గతంలోనూ పలువురికి సహాయపడ్డారు. పుట్టుకతోనే గుండెకు రంధ్రంతో జన్మించిన ఓ చిన్నారికి అండగా నిలిచారు. తిరుపతిలోని స్విమ్స్ ఆస్పత్రిలో చిన్నారికి ఆపరేషన్ చేయించారు.10 లక్షల ఖర్చయ్యే ఆపరేషన్‌ను స్విమ్స్ ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి ఉచితంగా చేయించి, ఆ పసికందు ప్రాణాలు నిలబెట్టారు. దీంతో ఆ చిన్నారి కుటుంబసభ్యులు బొలిశెట్టికి కృతజ్ఞతలు తెలియజేశారు.

 

అలాగే ప్రమాదంలో అమ్మానాన్నలను కోల్పోయిన ఓ బాలికకు కూడా అండగా నిలిచారు బొలిశెట్టి. అనాథగా మారిన చిన్నారి బాగోగుల కోసం.. తన జీతాన్ని విరాళంగా అందించారు. బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన పనికి పలువురు ప్రశంసలు కురిపించారు.

Search
Categories
Read More
Arunachal Pradesh
Over 600 Join Anti-Drug Marathon Held in Itanagar
To mark the International Day Against Drug Abuse and Illicit Trafficking, the Capital Police of...
By Lokeshwari Panthadi 2026-06-27 04:19:33 0 108
Andhra Pradesh
పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి: కలెక్టర్.
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కింద వచ్చిన అర్జీలను...
By Pagadala Venkateswar 2026-03-24 03:43:16 0 192
Telangana
పాలకుర్తి : ప్రేమ వ్యవహారంలో హత్య... నిందితుడి అరెస్ట్
పాలకుర్తి మండలం పూటూరు గ్రామానికి చెందిన బూతు  సుమలతను ప్రేమ వ్యవహారంలో  స్వామి అనే...
By Sunka Santhosh 2026-05-16 07:14:37 0 189
Telangana
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం
కోస్గి పట్టణ ఎస్సై ఆంజనేయులు గారికి ఘన పదవి విరమణ సన్మానం కోస్గి పట్టణ ఎస్సైగా సుదీర్ఘకాలం...
By Vanmoj Suryamohan 2026-01-31 06:56:34 0 549
SURAKSHA
Pillar of Justice: The Remarkable Journey of IPS Dr. Prafulla Kumar Roushan
From Academic Excellence to Iron-Clad Security: How a Visionary Officer is Shaping Modern Law...
By Kalaga Sailaja 2026-07-27 06:14:17 0 158
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com