Vangalapudi Anitha: మీవల్లే పోలీసులపై నమ్మకం పెరిగింది.. మహిళా కానిస్టేబుల్ జయశాంతికి మంత్రి అనిత అభినందనలు.

0
233

విధి నిర్వహణలో చూపిన చొరవను ప్రత్యేకంగా అభినందించిన మంత్రి

జయశాంతి చర్య పోలీసులపై ప్రజల నమ్మకాన్ని పెంచిందన్న అనిత

త్వరలో కలుద్దామని కానిస్టేబుల్‌కు హామీ ఇచ్చిన హోంమంత్రి

మహిళా కానిస్టేబుల్ జయశాంతిపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత ప్రశంసలు కురిపించారు. ఆమెకు స్వయంగా ఫోన్ చేసి అభినందించారు. విధి నిర్వహణలో లేనప్పటికీ సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరించిన తీరును మంత్రి కొనియాడారు. ఈ సందర్భంగా జయశాంతి కుటుంబ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.

 

జయశాంతి వంటి వారి నిబద్ధత వల్ల పోలీసు శాఖపై ప్రజల్లో మరింత గౌరవం, నమ్మకం పెరుగుతాయని మంత్రి అనిత అన్నారు. జయశాంతి చూపిన స్ఫూర్తి ప్రశంసనీయమని పేర్కొన్నారు. హోంమంత్రిని కలిసేందుకు జయశాంతి ఆసక్తి చూపగా, త్వరలోనే తప్పకుండా కలుద్దామని అనిత హామీ ఇచ్చారు.

 

ఈ విషయంపై మంత్రి అనిత ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్ర‌త్యేకంగా పోస్టు పెట్టారు. పోలీసుల గౌరవాన్ని పెంచిన జయశాంతిని సోషల్ మీడియాలో అభినందించిన ప్రతిఒక్కరికీ పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు.

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
రాయచోటి నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక. మంత్రి మండిపల్లి
*రాయచోటి అసెంబ్లీ నియోజకవర్గ ప్రజలకు ముఖ్య గమనిక*   SIR కార్యక్రమం ముగిసిన తర్వాత ఇప్పుడు...
By Benguluri Madhubabu 2026-08-21 10:25:56 0 164
Andhra Pradesh
నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి
ప్రచురణార్ధం.18.01.26   తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రివర్యులు, విశ్వ...
By Rajini Kumari 2026-01-18 13:22:19 0 213
Telangana
World press day
ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం సందర్భంగా పాత్రికేయ సోదర, సోదరీమణులకు ముఖ్యమంత్రి శ్రీ ఎ....
By G k Nookala 2026-05-03 06:04:30 0 212
Andhra Pradesh
మారేడుమిల్లి చింతూరు ఘాట్ రోడ్డులో ఘోర రోడ్డు ప్రమాదం 20 మందికి తీవ్ర గాయాలు!
మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డుపై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం...
By Shyamala Yadagiri 2026-06-05 10:17:12 0 284
Chandigarh
Chandigarh Advances Waste Management and Green Goals
Chandigarh continues to strengthen its commitment to waste management and environmental...
By Fathima Safa 2026-06-25 11:32:30 0 164
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com