జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.

0
267
బాపట్ల: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించిన జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు.
తమ సమస్యలను విన్నవించుకున్న 36 మంది అర్జీదారులు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలి
జిల్లా ఎస్పీ శ్రీ బి. ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు
అర్జీలు పునరావృతం కాకుండా సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని జిల్లా ఎస్పీ శ్రీ బి.ఉమామహేశ్వర్ ఐపీఎస్ గారు పోలీస్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ గారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. వరకట్న వేధింపులు, కుటుంబ సమస్యలు, భూ వివాదాలు, ఆర్థిక లావాదేవీలు తదితర పలు సమస్యలతో మొత్తం 36 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు.
జిల్లా ఎస్పీ గారు అర్జీదారుల సమస్యలను కూలంకషంగా విని, వారి అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి, నిర్దిష్ట గడువులోగా ఫిర్యాదిదారుల సమస్యలను పరిష్కరించాలని సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు పునరావృతం కాకుండా చట్ట పరిధిలో విచారించి సంతృప్తికర రీతిలో పరిష్కరించాలని పోలీస్ అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎస్ డీఎస్పీ పి. జగదీష్ నాయక్, పీజీఆర్ఎస్ సెల్ ఇన్‌స్పెక్టర్ పి. ప్రభాకర్‌తో పాటు ఇతర పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
 
#Narendra
Search
Categories
Read More
Andhra Pradesh
కానిస్టేబుల్ రంగారావుకు అధికార లాంఛనాలతో తుది వీడ్కోలు.
అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖలో విషాదం చోటుచేసుకుంది. జిల్లా ఏఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్‌గా...
By Pagadala Venkateswar 2026-05-16 05:05:53 0 133
West Bengal
CM Suvendu Adhikari Begins Maiden North Bengal Tour
In his first official visit to North Bengal since taking oath as Chief Minister on May 9, Suvendu...
By Dunna Jessicaruth 2026-05-20 10:31:41 0 134
SURAKSHA
Breaking Barriers: Arunachal's First Woman IPS Officer
How Tenzin Yangki Wrote History from Tawang to the National Police Service "Being first is never...
By Kalaga Sailaja 2026-07-30 08:49:40 0 329
Andhra Pradesh
స్వర్ణం వార్డు-స్వర్ణ సచివాలయాలు
ఇక నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయా పేరు ను అధికారికంగా మార్చింది.ఇక నుంచి స్వర్ణ...
By Karapati Gopi 2025-12-30 01:02:52 0 324
SURAKSHA
AP పోలీసులు: సైబర్ మోసాలపై అవగాహన యోధులుగా నేడు
నేడు AP పోలీసులు రాష్ట్రమంతటా సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీలు చేశారు. విశాఖ, గుంటూరు, గ్రామాల్లో OTP...
By Kalaga Sailaja 2026-07-04 09:39:51 0 113
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com