పన్ను బకాయిల చెల్లింపు మీ బాధ్యతగా గుర్తించండి : మున్సిపల్ కమిషనర్

0
180

కర్నూలు : కర్నూలు సిటీ : 

‘పన్ను చెల్లింపు బాధ్యతగా భావించండి’

• నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ
• 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులు సీజ్ !!

నగరపాలక సంస్థకు పన్ను చెల్లించడం భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ మొండి బకాయిదారులకు సూచించారు. సోమవారం నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ కాలువల నిర్మాణం, పార్కుల నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి నగరపాలక సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలంటే వంద శాతం బకాయిలు సకాలంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొందరు పన్నులు చెల్లించకుండా ఇతరులు చెల్లించిన పన్నులతో నగరపాలక సేవలు పొందాలనుకోవడం సమంజసం కాదన్నారు. ప్రతి పౌరుడు పన్ను చెల్లింపును బాధ్యతగా భావించినప్పుడే నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రతిరోజూ కొనసాగిస్తామని, అగ్ర మొండి బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఆర్వోలు జునైద్, వాజీద్, స్వర్ణలత, ఆర్‌ఐలు భార్గవ్, తిప్పన్న, శ్రీకాంత్, ఏఆర్‌ఐలు, అడ్మిన్‌లు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
వృద్ధురాలు మిస్సింగ్
చిత్తూరు జిల్లా, పుంగునూరు నియోజకవర్గం, సోమల మండలం, గన్నవారిపల్లె గ్రామానికి చెందిన 84 ఏళ్ల దాసరి...
By Kothuru Murali 2026-01-02 04:53:33 0 202
Andhra Pradesh
ఉపాధి హామీ చట్టం రద్దు కేంద్రం కుట్ర రాష్ట్ర కార్యదర్శి సిపిఎం వి శ్రీనివాసరావు
For Scrolling : ఉపాధి హామీ చట్టం రద్దుకు కేంద్రం కుట్ర. తక్షణం ఉపసంహరించాలని సిపియం రాష్ట్ర...
By Rajini Kumari 2025-12-16 09:50:20 0 182
Telangana
మంచిర్యాల్:MLA ఇంటికి చేరుకున్న సీఎం
ఆసిఫాబాద్ పర్యటన ముగించుకొని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం రాత్రి మంచిర్యాల్ ఎమ్మెల్యే శ్రీ...
By Bonagiri RaviShankar 2026-06-02 04:02:16 0 157
Lakshdweep
Lakshadweep Promotes Eco-Tourism and Green Conservation
Lakshadweep continues to advance eco-tourism and environmental conservation in 2026 by promoting...
By Fathima Safa 2026-07-04 13:17:30 0 71
Andhra Pradesh
రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు...ఇంకా పూర్తి వివరాలు తెలియలిసి ఉంది...
రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల...
By Gadiyapudi Narendra 2026-01-04 16:07:54 0 244
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com