రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు...ఇంకా పూర్తి వివరాలు తెలియలిసి ఉంది...

0
275

రేపల్లె మండలం పెనుమూడి చెకపోస్ట్ దగ్గర వేమూరు నుండి కృష్ణ జిల్లా వెళ్తున్న లారిలో 25 టన్నుల  అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న పోలీసులు...ఇంకా పూర్తి వివరాలు తెలియలిసి ఉంది...

 

బాపట్ల: బాపట్ల మండలం బేతపూడి గ్రామంలో శ్రీ కుంచాల రాంబాబు రెడ్డి అనువారు పర్మినెంట్ డీలర్గా నిర్వహిస్తున్న చౌక ధర దుకాణం నెంబరు.0757062 నందు ఈ మాసములో ఈరోజు వరకు మొత్తము 12 మంది కార్డుదారులకు మాత్రమే నిత్యావసర సరుకులు పంపిణీ జరిపి, ఈరోజు అనగా 04-01-026న అస్సలు పంపిణీ చేయనందున, సదరు దుకాణమును ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంలో..... అచ్చట ఉండవలసిన బియ్యం నిల్వలు 12950 కేజీలకు గాను, 12150 కేజీలు మాత్రమే ఉన్నందున, అనగా 800 కేజీలు (8 క్వింటాళ్లు) బియ్యము తక్కువగా ఉండటాన్ని గమనించి, సదరు షాపుపై శ్రీయుత జిల్లా జాయింట్ కలెక్టర్ బాపట్ల వారి కోర్టులో కేసు నమోదు చేయుచు, సదరు  డీలర్ పై తగు క్రమశిక్షణ చర్యలు తీసుకొనుటకు గాను శ్రీయుత రెవిన్యూ డివిజనల్ అధికారి, బాపట్ల వారికి నివేదిక సమర్పించడం అవుతున్నది. 

ఈ సందర్భముగా డీలర్లు అందరికి మరొకసారి పత్రిక ముఖముగా తెలియజేయునది ఏమనగా.....

డీలర్లు అందరూ ప్రతి నెల ఒకటవ తేదీ నుండి 15వ తేదీ వరకు క్రమం తప్పకుండా సమయానికి అనగా ఉ.8 నుండి మధ్యాహ్నం 12 వరకు మరియు సా.4 గం నుండి రాత్రి 8 గం.ల వరకు కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయవలెను. 

షాపు నందు ఉండవలసిన నిత్యావసర సరుకుల నిల్వలు లలో ఎట్టి పరిస్థితులలో వ్యత్యాసములు ఉండటానికి వీల్లేదు. 

నిల్వలలో ఏదైనా వ్యత్యాసములు కనుగొనబడిని పక్షంలో... అట్టి డీలర్ పై తగు కేసులు తప్పక నమోదు చేయబడునని తెలియజేయడ మైనది.

ఈ తనిఖీలలో సి ఎస్ డి టి, బాపట్ల సివిల్ ఫణి కుమార్, బేతపూడి విఆర్ఓ ఎం. వలి బాబు తదితరులు పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
వరద ముంపుకు గురైన కాలనీలు- పరిశీలించిన ఎమ్మెల్యే
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : గవర్నమెంట్ > రాత్రి కురిసిన భారీ వర్షానికి నియోజకవర్గంలోని పలు...
By Sidhu Maroju 2025-09-18 08:42:37 0 358
Andhra Pradesh
ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రైవేటీకరణ వ్యతిరేకంగా జీవోలు దగ్ధం
*ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జీవోలు దహనం*   *భోగిమంటల్లో జీవో 590,...
By Rajini Kumari 2026-01-14 12:26:58 0 202
Arunachal Pradesh
Arunachal Boosts Employment and Entrepreneurship Growth
Arunachal Pradesh continues to promote employment and entrepreneurship by supporting startups,...
By Fathima Safa 2026-07-03 14:24:22 0 182
Telangana
"ఏఐ శక్తి.. సైబర్ భక్తి" కాదు.. భద్రతకు కొత్త భయం.|
● Anthropic Claude మోడల్స్‌పై సంచలన ప్రకటన ● సైబర్ పరీక్షల్లో బయటపడిన భద్రతా లోపాలు ● ఏఐ...
By Sidhu Maroju 2026-07-31 13:21:31 0 237
Puducherry
Puducherry Strengthens Biodiversity Conservation Efforts
Puducherry continues to advance environmental conservation and biodiversity protection in 2026...
By Fathima Safa 2026-07-04 13:25:47 0 110
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com