పన్ను బకాయిల చెల్లింపు మీ బాధ్యతగా గుర్తించండి : మున్సిపల్ కమిషనర్

0
181

కర్నూలు : కర్నూలు సిటీ : 

‘పన్ను చెల్లింపు బాధ్యతగా భావించండి’

• నగరపాలక అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ
• 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులు సీజ్ !!

నగరపాలక సంస్థకు పన్ను చెల్లించడం భారంగా కాకుండా బాధ్యతగా భావించాలని అదనపు కమిషనర్ ఆర్‌జి‌వి కృష్ణ మొండి బకాయిదారులకు సూచించారు. సోమవారం నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను వసూళ్లను ముమ్మరం చేశారు. 12 మంది మొండి బకాయిదారుల ఆస్తులను సీజ్ చేశారు.

ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ.. నగరంలో రహదారుల అభివృద్ధి, డ్రైనేజీ కాలువల నిర్మాణం, పార్కుల నిర్వహణ, తాగునీటి సరఫరా, వీధి దీపాల ఏర్పాటు వంటి నగరపాలక సేవలు ప్రజలకు పూర్తిస్థాయిలో అందించాలంటే వంద శాతం బకాయిలు సకాలంలో చెల్లించాల్సి ఉంటుందన్నారు. కొందరు పన్నులు చెల్లించకుండా ఇతరులు చెల్లించిన పన్నులతో నగరపాలక సేవలు పొందాలనుకోవడం సమంజసం కాదన్నారు. ప్రతి పౌరుడు పన్ను చెల్లింపును బాధ్యతగా భావించినప్పుడే నగరాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని పేర్కొన్నారు. మొండి బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ను ప్రతిరోజూ కొనసాగిస్తామని, అగ్ర మొండి బకాయిదారుల ఆస్తులను జప్తు చేస్తామని స్పష్టం చేశారు.

కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, కార్యదర్శి నాగరాజు, ఆర్వోలు జునైద్, వాజీద్, స్వర్ణలత, ఆర్‌ఐలు భార్గవ్, తిప్పన్న, శ్రీకాంత్, ఏఆర్‌ఐలు, అడ్మిన్‌లు తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Bharat Aawaz
1975 Emergency to Today: Are We Truly Free?
"𝐖𝐡𝐞𝐧 𝐭𝐫𝐮𝐭𝐡 𝐢𝐬 𝐬𝐢𝐥𝐞𝐧𝐜𝐞𝐝, 𝐝𝐞𝐦𝐨𝐜𝐫𝐚𝐜𝐲 𝐰𝐡𝐢𝐬𝐩𝐞𝐫𝐬 𝐢𝐧 𝐟𝐞𝐚𝐫." 𝐉𝐮𝐧𝐞 𝟐𝟓, 𝟏𝟗𝟕𝟓 𝐨𝐧𝐞 𝐨𝐟 𝐭𝐡𝐞 𝐝𝐚𝐫𝐤𝐞𝐬𝐭 𝐧𝐢𝐠𝐡𝐭𝐬 𝐢𝐧...
By Bharat Aawaz 2025-06-25 07:37:02 0 2K
Bihar
Mining Jackpot: Rare Minerals Found in Banka & Bhagalpur
Bihar is emerging as a massive hotspot on India’s mineral map. The state government...
By Dunna Jessicaruth 2026-05-21 05:27:41 0 101
Punjab
Special NIA Court Pronounces Sentences for Three Convicted in 2018 Terror Case
The Special National Investigation Agency (NIA) Court in Mohali has handed down prison sentences...
By Tejaswini Komanduru 2026-06-05 07:10:16 0 478
SURAKSHA
Dr. N. Yuvaraj IAS: Leading Innovation and Industrial Growth
A distinguished Andhra Pradesh cadre IAS officer whose leadership in industrial development,...
By Lokeshwari Panthadi 2026-07-16 08:48:31 0 61
Telangana
బిఆర్ఎస్ పార్టీని దిక్కరించిన కవితను సస్పెండ్ చేయడం కరెక్టే : మాజీ మంత్రి మల్లారెడ్డి
హైదరాబాద్: ఎమ్మెల్సీ కవితపై బిఆర్ఎస్ అధిష్టానం వేటు వేసిన అంశంపై మాజీమంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే...
By Sidhu Maroju 2025-09-03 10:31:33 0 401
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com