అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు

0
709

అనంతపురంలో గంజాయి కట్టడికి కఠిన చర్యలు 

జిల్లా ఎస్పీ శ్రీ పి.జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు పార్శిల్ సర్వీస్ కార్యాలయాల్లో పోలీసుల విస్తృత తనిఖీలు

 

జిల్లా ఎస్పీ శ్రీ పి. జగదీష్ IPS గారి ఆదేశాల మేరకు... గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టే దిశగా అనంతపురం త్రీటౌన్ సి.ఐ శ్రీ రాజేంద్రనాథ్ యాదవ్ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా కేంద్రంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా అనంతపురం త్రీటౌన్ పరిధిలోని వివిధ పార్శిల్ సర్వీస్ కార్యాలయాలు మరియు ఆర్టీసీ బస్టాండులలో స్నిఫర్ డాగ్ సహకారంతో విస్తృత తనిఖీలు కొనసాగాయి. పార్శిళ్ల ద్వారా గంజాయి లేదా ఇతర నిషేధిత మత్తు పదార్థాలు రవాణా అవుతున్నాయా అనే కోణంలో పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ తనిఖీల ప్రధాన లక్ష్యం గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల అక్రమ వినియోగం, రవాణాను అరికట్టి ప్రజల భద్రతను కాపాడడమేనని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత మరియు గంజాయి కట్టడి దృష్ట్యా ఇటువంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు స్పష్టం చేశారు. అనుమానాస్పద పార్శిళ్లపై అప్రమత్తంగా ఉండాలని, పోలీసులకు పూర్తి సహకారం అందించాలని కోరారు. అలాగే ప్రజలు ఎవరైనా మత్తు పదార్థాల అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.

 

Search
Categories
Read More
SURAKSHA
Drug Crackdown: Goa Police Arrests 150+ Peddlers
Goa Police Anti-Narcotics Cell works 24x7 to make Goa drug-free. Special raids at beaches, clubs...
By Kalaga Sailaja 2026-07-03 07:02:19 0 356
Telangana
తెలంగాణ : ఉజ్జయిని మహంకాళి బోనాలు
సికింద్రాబాద్ మహంకాళి బోనాల జాతర ఘనంగా జరిగింది. ఈరోజు తెల్లవారు జామున నుంచే భక్తులు అమ్మవారికి...
By Sunka Santhosh 2026-08-02 18:26:19 0 178
Telangana
మేడారానికి పోటెత్తిన భక్తులు
మేడారానికి పోటెత్తిన భక్తులు తెలంగాణ : ములుగులోని మేడారం మహా జాతర కోసం భక్తులు వేలాదిగా...
By Pinnehasan Odela 2026-01-16 09:12:44 0 336
Andhra Pradesh
నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల...
By Patan Khuddus 2026-06-25 18:38:19 0 240
Telangana
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం
లక్సెట్టిపేటలో పోలీసుల కార్డన్ సెర్చ్,46 ద్విచక్ర వాహనాలు,ఒక ఆటో స్వాధీనం   లక్సెట్టిపేట...
By Pinnehasan Odela 2026-05-20 12:28:11 0 287
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com