కేబుల్ మెడకు తగిలి ప్రధాన ఉపాధ్యాయుడు మృతి చీరాల మండలంలో విషాద ఘటన

0
243

చీరాల: చీరాల మండలం పరిధిలోని దేవి నూతల గవినివారి పాలెం రహదారిపై మంగళవారం ఉదయం ఓ విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. ద్విచక్ర వాహనంపై హైస్కూల్‌కు వెళ్తున్న గవినివారి పాలెం హైస్కూల్ ప్రధాన ఉపాధ్యాయుడు అంగిరేకుల శ్రీనివాసరావు ప్రమాదవశాత్తు మృతి చెందారు.
వివరాల ప్రకారం, అంగిరేకుల శ్రీనివాసరావు తన ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ హైస్కూల్‌కు చేరుకుంటున్న సమయంలో, రహదారి మధ్యలో అడ్డంగా ఉన్న కేబుల్ ఆయన మెడకు తగలడంతో తీవ్ర ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయం తెలుసుకున్న తోటి ఉపాధ్యాయులు ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయారు. నిత్యం స్కూల్‌కు ముందుగా చేరే ప్రధాన ఉపాధ్యాయుడు వస్తారని ఎదురుచూస్తున్న ఉపాధ్యాయులకు ఈ దుర్వార్త తెలియడంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. సమాచారం అందిన వెంటనే పెద్ద ఎత్తున సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు.
పాఠశాలకు కొద్ది దూరంలోనే ఈ ప్రమాదం జరగడంతో, గవినివారి పాలెం హైస్కూల్ పరిసర ప్రాంతంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. కేబుల్‌ను రహదారిపై నిర్లక్ష్యంగా వదిలివేయడమే ఈ ఘోర ప్రమాదానికి కారణమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Andhra Pradesh
పండగలో అల్లర్లు, గొడవలు చేస్తే కఠిన చర్యలు
పండగలో గొడవలు, అల్లర్లు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పట్టణ సీఐ కె.నారాయణరావు అన్నారు. బొబ్బిలి...
By Boiena Rajesh 2026-04-27 05:44:02 0 235
Telangana
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా!
ఇంటర్ పరీక్ష ఫలితాలు.. ఏప్రిల్ మూడో వారానికి వాయిదా! తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో...
By Pinnehasan Odela 2026-04-08 13:32:29 0 214
Telangana
నగల దుకాణంలో దొంగతనంలో చోరి - ఘటన స్థలంలోనే FIR నమోదు చేసిన పోలీసులు. |
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక నగల దుకాణంలో భారీ చోరీ...
By Sidhu Maroju 2026-01-30 12:03:23 0 399
Telangana
రైతు భరోసా నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్‌రెడ్డి
Cm Revanth Reddy 
By Sunka Santhosh 2026-03-23 10:47:13 0 366
Andhra Pradesh
Payyavula Keshav: కల్తీ నెయ్యి వ్యవహారంలో వైసీపీ గుట్టురట్టు... ఇవిగో ఆధారాలు: పయ్యావుల కేశవ్.
టీటీడీ నెయ్యి కల్తీకి వైసీపీ ప్రభుత్వమే కారణమన్న పయ్యావుల 2022లోనే కల్తీపై...
By Pagadala Venkateswar 2026-01-31 12:13:00 0 240
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com