యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్

0
174

కర్నూలు : కర్నూలు సిటీ : 

*

యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
స్థానిక ఎస్టిబిసి కళాశాల మైదానంలో  టిజిబి, లక్కీ టు వెంకటేశ్వర్లు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో క్రీడలు అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టమన్నారు.  క్రికెట్ పోటీలలో  80 జట్లు పాల్గొనడం విశేషం అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే ధ్యేయంగా టీజీబి,లక్కీ టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, తన తనయుడు టీజీ భరత్ పేరు మీద మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 50వేల రూపాయలను నిర్వాహకులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారు ఎంచుకున్న రంగాలలో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని టీజీ తెలిపారు. అలాగే క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకుడు లక్కీ టు గోపి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Telangana
శాంతి శ్రీనివాస్ రెడ్డి వినతి స్వీకరించిన సంచిత్ గంగ్వార్.|
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ డివిజన్‌లో పెండింగ్‌లో ఉన్న పలు అభివృద్ధి పనులకు...
By Sidhu Maroju 2026-06-22 08:53:06 0 121
Business & Finance
Goa Hospitality Sector Attracts New Investments
Goa's hospitality industry is attracting fresh investments in hotels, resorts, and luxury...
By Navya Sree 2026-07-06 07:46:12 0 94
Andhra Pradesh
సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు ఎస్ సి ఆర్
*సంక్రాంతికి 16 ప్రత్యేక రైళ్లు: SCR*   సంక్రాంతి సందర్భంగా 16 అదనపు ప్రత్యేక రైళ్లను...
By Rajini Kumari 2025-12-17 09:25:03 0 223
Telangana
నిజామాబాద్:హిందూసమేలనంలో పలుగొన్న ఎమ్మెల్యే
నగరంలో నీ బాస్వాగార్డెన్ లో నివాహిన్‌చిన హిందూసమేళనం కార్యక్రమంలో పలుగొన్న ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-04-21 14:51:00 0 138
Andhra Pradesh
క్రీడాస్ఫూర్తితో విద్యార్థులు ఎదగాలి: చల్లపల్లి నరసింహరెడ్డి.
మదనపల్లె మండలం, గంగన్నగారిపల్లెలోని శ్రీ కృష్ణ చైతన్య ఫార్మసీ, నర్సింగ్ కళాశాలలో వార్షిక...
By Pagadala Venkateswar 2026-01-23 06:46:25 0 165
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com