యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం : టీజీ వెంకటేష్

0
176

కర్నూలు : కర్నూలు సిటీ : 

*

యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్

క్రీడల అభివృద్ధికి కృషి చేస్తూ యువ క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు.
స్థానిక ఎస్టిబిసి కళాశాల మైదానంలో  టిజిబి, లక్కీ టు వెంకటేశ్వర్లు యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో క్రీడలు అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టమన్నారు.  క్రికెట్ పోటీలలో  80 జట్లు పాల్గొనడం విశేషం అన్నారు. యువతను క్రీడల్లో ప్రోత్సహించడమే ధ్యేయంగా టీజీబి,లక్కీ టు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి, తన తనయుడు టీజీ భరత్ పేరు మీద మొదటి బహుమతిగా లక్ష రూపాయలు, రెండవ బహుమతిగా 50వేల రూపాయలను నిర్వాహకులు ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల చెడు అలవాట్లకు దూరంగా క్రమశిక్షణ గల పౌరులుగా ఎదిగేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. క్రీడల్లో పాల్గొనడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడి వారు ఎంచుకున్న రంగాలలో మరింత రాణించేందుకు అవకాశం ఉంటుందని టీజీ తెలిపారు. అలాగే క్రీడల్లో పాల్గొని గెలుపు ఓటములను సమానంగా స్వీకరించడం ద్వారా జీవితంలో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకునే శక్తి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో పోటీల నిర్వాహకుడు లక్కీ టు గోపి తదితరులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
దివ్యాంగుల దృవీ కరణ పత్రాల పరిశీ లన
ఈ రోజు కలెక్టర్ కార్యా లయం లో అదనపు కలెక్టర్ గొబ్బిల్ల విద్యా దరి గారి ఆధ్వర్యంలో దివ్యాంగుల...
By Mobbu Venkatramana 2026-02-11 13:33:13 2 389
Andhra Pradesh
మానవత్వం మరచిన కఠినాత్ముడికి మరణశిక్ష పడాలి.... ఎమ్మెల్యే జహ.
మదనపల్లి సిల్క్ టౌన్ లో ఏడేళ్ల చిన్నారి పై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన కులవర్ధన్ ను కఠినంగా...
By Pagadala Venkateswar 2026-02-17 11:49:33 0 146
SURAKSHA
Dependra Pathak: A Visionary IPS Officer in Policing
From grassroots policing to national leadership, Dependra Pathak has built a distinguished career...
By Lokeshwari Panthadi 2026-07-24 07:22:18 0 25
Telangana
బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారి సమక్షంలో ఘనంగా మేడ్చల్ ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్ మన్నె రాజు గారి జన్మదిన వేడుకలు.
  తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని మేడ్చల్ జిల్లా ఫిషరీస్ కో-ఆపరేటివ్ చైర్మన్...
By Sidhu Maroju 2025-06-12 11:58:39 0 1K
Goa
Goa BJP Reviews Organization and Governance Priorities
The Goa BJP State Executive Committee convened to review the party's organizational progress and...
By Navya Sree 2026-06-25 07:17:45 0 79
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com