ఏప్రిల్ దర్శనం టికెట్లు రేపు విడుదల : టీటీడీ

0
181

కర్నూలు : 2026 ఏప్రిల్ నెలకు సంబంధించి వివిధ దర్శనాలు, గదుల కోటా వివరాలను, శ్రీవారి ఆర్జిత సేవ టికెట్లు (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జనవరి 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్ లో నమోదు చేసుకోవచ్చు. ఈ టికెట్లు పొందిన వారు జనవరి 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాలి.
22న కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, శ్రీవారి సాలకట్ల వసంతోత్సవాల టికెట్లను, అదేరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్ల కోటాను విడుదల చేయనుంది. 23న అంగప్రదక్షిణ టోకెన్లు, శ్రీవాణి ట్రస్ట్ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
24న ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా, మధ్యాహ్నం తిరుమల, తిరుపతిలో గదుల కోటా విడుదల చేస్తారు. 27న శ్రీవారి సేవ, పరకామణి సేవ కోటాను విడుదల చేయనున్నారు https://ttddevasthanams.gov.in వెబ్‌సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది.

Search
Categories
Read More
Andhra Pradesh
జాతీయ విలువిద్య పోటీలకు మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారికి ఆహ్వానం
మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర యువజన రవాణా క్రీడా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి...
By Benguluri Madhubabu 2026-03-24 12:03:13 0 218
Andhra Pradesh
బొలెరో ఢీకొని ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలు.
సోమవారం ములకలచెరువు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అనంతపురానికి చెందిన భాను ప్రకాశ్ (24),...
By Pagadala Venkateswar 2026-05-19 05:12:52 0 73
Bharat Aawaz
Installment Loot": Opposition Slams Modi Government Over Massive Fuel Price Hike
India’s state-run oil companies implemented a sharp fuel price hike, raising petrol by...
By Hazu MD. 2026-05-25 09:47:23 0 282
Andhra Pradesh
టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు భాస్కర్ల చంద్రశేఖర్ 50వేల రూపాయలు విరాళం ఇచ్చారు.
శ్రీశ్రీశ్రీ మాతా బంగారం అవ్వ దేవి దేవాలయం నూతన గోపుర కలశం మరియు ముఖద్వారం ప్రతిష్ట మరియు...
By Boya Dasthagiri 2026-03-28 08:23:17 0 296
Andhra Pradesh
మైనర్ బాలురు వాహనాలు నడిపితే వారి తల్లిదండ్రులే బాధ్యులని ఆయన హెచ్చరించారు
పుంగనూరు పట్టణంలో సీఐ సుబ్బరాయుడు, సిబ్బంది కలిసి శనివారం వాహనాల తనిఖీని నిర్వహించారు. జిల్లా...
By Kothuru Murali 2026-01-11 08:11:50 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com