వెల్లంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

0
212

విజయవాడ

15-01-2025

 

ప్రచురణార్ధం

 

వెలంపల్లి ఇంట అంబరాన్ని అంటిన సంక్రాంతి సంబరాలు

 

కుటుంబ సభ్యులతో కలిసి సంక్రాంతి సంబరాలలో పాల్గొన్న మాజీ మంత్రి వెలంపల్లి

 

స్థానిక బ్రాహ్మణ వీధిలోని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు నివాసం వద్ద గురువారం నాడు సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించారు. గంగిరెద్దుల ఆటలు, గొబ్బెమ్మలు, కోడి పందాలు, ముగ్గులు, హరిదాసుల కీర్తనల మరియు తదితర సాంస్కృతిక కార్యక్రమాలలో కుటుంబ సభ్యులతో కలిసి మాజీ మంత్రి, పశ్చిమ వైసిపి ఇంచార్జ్ వెలంపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి వెలంపల్లి మాట్లాడుతూ తెలుగు ప్రజలకు అత్యంత ముఖ్యమైన సంక్రాంతి పండుగని, ముఖ్యంగా రైతులు పండించిన పంటలు ఇంటికి వచ్చే ఈ శుభ సమయాన్ని, మన సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్వహిస్తారని అన్నారు. గంగిరెద్దులు మరియు హరిదాసుల వంటి ప్రాచీన తెలుగు సంస్కృతిని నేటి తరానికి తెలిసేలా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ ఎక్కడ ఉన్నా తమ సొంత ఊర్లకు చేరుకుని, కుటుంబ సభ్యులతో కలిసి మూడు రోజుల పాటు పండుగను జరుపుకోవడం మన సంప్రదాయంలోని గొప్పతనమని, ఈ వేడుకల్లో వారి కుమార్తెలు, అల్లుళ్లు మరియు మనవరాళ్లతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజలందరూ అమ్మవారి ఆశీస్సులతో అభివృద్ధి చెందుతూ, ప్రతి ఇల్లు సిరిసంపదలతో మరియు సుఖసంతోషాలతో నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.

Search
Categories
Read More
Entertainment
India enter T20 world Cup final
టీ20 వరల్డ్‌ కప్‌: ఫైనల్‌లోకి భారత్‌ 🏏🇮🇳 టీ20 వరల్డ్‌ కప్‌ రెండో...
By G k Nookala 2026-03-05 17:40:08 0 171
Andhra Pradesh
మదనపల్లె: టిప్పర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు.
మదనపల్లె మండలంలో ఆదివారం అక్రమంగా మట్టి తరలిస్తున్న టిప్పర్ ఢీకొని దంపతులతో పాటు వారి కుమారుడు...
By Pagadala Venkateswar 2026-05-18 04:17:44 0 116
Andhra Pradesh
మేనల్లుడి పార్టీ మార్పుపై బొత్స స్పందన
మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) పార్టీ మారడంపై వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ...
By Boiena Rajesh 2026-09-09 12:14:01 0 144
Telangana
అక్రమ స్టెరాయిడ్ ముఠా గుట్టురట్టు.. ఆరుగురు అరెస్ట్.|
"6.50 లక్షల విలువైన స్టెరాయిడ్ ఇంజెక్షన్లు, సప్లిమెంట్లు స్వాధీనం" హైదరాబాద్,జూలై...
By Sidhu Maroju 2026-07-04 11:36:32 0 181
Andhra Pradesh
బిజెపి ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎస్ మాధవ్
*బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్*   వాజ్ పాయ్ ఒక నిష్కల చరిత్రుడు, అజాత...
By Rajini Kumari 2025-12-12 12:57:27 0 348
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com