మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకున్న కేశినేని నాని గారు

0
230

*మేడారం సమ్మక్క–సారక్క గద్దెను దర్శించుకున్న కేశినేని నాని గారు*

 

* ములుగు జిల్లా మేడారం లోని ప్రపంచ ప్రఖ్యాత సమ్మక్క–సారక్క గద్దెను ఈ రోజు మాజీ ఎంపీ శ్రీ కేశినేని నాని గారు భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ముందుగా అమ్మవార్లకు బెల్లం తులాభారం సమర్పించి, అనంతరం గిరిజనుల ఆరాధ్య దైవాలైన సమ్మక్క–సారక్క అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, శాంతి–సమృద్ధి కోసం ప్రార్థనలు చేశారు.

 

* ఆలయానికి వచ్చిన కేశినేని నాని గారికి ఆలయ అధికారులు సంప్రదాయ పద్ధతుల్లో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని, అమ్మవార్ల ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

 

*ఈ సందర్భంగా కేశినేని నాని గారు మాట్లాడుతూ, సమ్మక్క–సారక్క జాతర గిరిజన సంస్కృతి, ఆచారాలకు ప్రతీకగా నిలిచిందని, దేశంలోనే అతిపెద్ద గిరిజన పండుగగా విశేష ఖ్యాతి పొందిందని పేర్కొన్నారు. అలాగే మేడారం జాతర నిర్వహణతో పాటు ఆలయ అభివృద్ధి కోసం నా ఆత్మీయ మిత్రుడు తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, గ్రామీణ అభివృద్ధి,పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరాల, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి సీతక్క గారు ఎంతో చక్కగా ఏర్పాట్లు చేయడం అభినందనీయమని తెలిపారు. గిరిజన సంప్రదాయాలు, వారి ఆధ్యాత్మిక విశ్వాసాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు.*

Search
Categories
Read More
Telangana
తెలంగాణలో ఏం జరుగబోతున్నది?
దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది....
By Ponnala Srinivasrao 2026-03-25 03:32:03 0 230
Andhra Pradesh
చిత్తూరు: క్రికెట్ ఆడుతూ యువకుడి మృతి
చౌడేపల్లి(M) వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ(22) పాలెంపల్లిలో...
By Kothuru Murali 2026-01-17 11:02:44 0 190
Telangana
గురు భక్తిలో ఎమ్మెల్యే.. సాయి సేవలో రాజశేఖర్ రెడ్డి.|
● సాయిబాబాను దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ● రాష్ట్ర ప్రజల సుఖసంతోషాలు,...
By Sidhu Maroju 2026-07-29 10:23:13 0 207
Andhra Pradesh
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. నలుగురి దుర్మరణం.
శ్రీకాళహస్తి మండలం ఊరందూరు వద్ద పుత్తలపట్టు-నాయుడుపేట జాతీయ రహదారిపై ఘటన ఆగి ఉన్న లారీని వేగంగా...
By Pagadala Venkateswar 2026-05-04 06:05:59 0 148
Telangana
మూతపడిన స్కూల్లో అల్ఫాజోలం తయారీ: దాడులు చేసిన ఈగల్ టీం. భారీగా ఆల్ఫాజోలం పట్టివేత
సికింద్రాబాద్ కంటోన్మెంట్:   బోయిన్ పల్లి పిఎస్ పరిధిలోని మూతపడిన మేధా పాఠశాలలో ఈగల్...
By Sidhu Maroju 2025-09-13 11:16:06 0 327
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com