దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం... బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు

0
253

దోమ కాటుతో ఏ ఒక్కరికి జ్వరం రాకూడదన్నదే  లక్ష్యం...
బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు

 

బాపట్ల: బాపట్ల జిల్లా కలెక్టర్ గారు మరియు డి ఎం హెచ్ ఓ గారి ఆదేశాల మేరకు కీటక జనిత వ్యాధుల నివారణే లక్ష్యంగా పనిచేస్తున్నామని, దోమ కాటు వల్ల ఏ ఒక్కరికి కూడా జ్వరం రాకూడదన్నది తమ ధ్యేయమని బాపట్ల జిల్లా మలేరియా అధికారి వి. నాగార్జునరావు అన్నారు.
ఈరోజు వెదుళ్ళపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని ప్రభుత్వ బదిరుల హాస్టల్లో ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న మలాథియాన్ ఫోకల్ స్ప్రేయిoగ్ కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. బాపట్ల జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్స్ మరియు వెల్ఫేర్ హాస్టల్స్ లో జరుగుతున్నటువంటి ఈ ఇండోర్ రేసిడ్యుల్ స్ప్రే ద్వారా మలేరియా డెంగ్యూ బోదకాలు తదితర వ్యాధులను కలుగజేసే దోమలు పూర్తిగా చనిపోతాయని, కీటక జనిత వ్యాధులను నిర్మూలన అనుకున్న లక్ష్యంగా చేరువవడంలో ఈ కార్యక్రమం చాలా ముఖ్యమని అన్నారు. ప్రజలు కూడా పరిసరాలలో అనవసరపు నీటి నిల్వలు మరియు మురుగునీరు లేకుండా పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడైనా మురుగునీరు నిల్వ  ఉన్న మరియు దోమ లార్వా పెరుగుదల ప్రదేశాలు ఉన్నా సంబంధిత ఆరోగ్య శాఖ కార్యకర్తలకు తెలియజేయాలని వారు పంచాయితీ సిబ్బంది సహకారంతో మురుగునీటిని తొలగించి దోమలను నిర్మూలించే కార్యక్రమాన్ని చేపడతారని చెప్పారు. కార్యక్రమంలో మలేరియా సబ్ యూనిట్ అధికారి షకీల్, హెచ్ ఓ దిడ్ల ప్రసాదు సూపర్వైజర్ రవిశంకర్ హెల్త్ అసిస్టెంట్ చంద్రమోహన్ పాల్గొన్నారు  పాల్గొన్నారు.

 

#Narendra

Search
Categories
Read More
Telangana
తెలంగాణ తదుపరి డీజీపీగా సీవీ ఆనంద్? కసరత్తు పూర్తి చేసిన యూపీఎస్‌సీ.|
  హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీ (డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్) ఎంపిక ప్రక్రియ తుది...
By Sidhu Maroju 2026-03-11 17:25:14 0 425
Karnataka
Bengaluru’s KIA Named World’s 3rd Most Family-Friendly Hub
Bengaluru’s Kempegowda International Airport (KIA) has achieved global acclaim, securing...
By Lokeshwari Panthadi 2026-06-29 06:00:49 0 85
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:29:18 0 92
Andhra Pradesh
విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజా దర్బార్
*Press Release*   *విశాఖలో మంత్రి నారా లోకేష్ 78వ రోజు ప్రజాదర్బార్*   *ప్రజలను...
By Rajini Kumari 2025-12-16 09:38:25 0 225
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం
రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న విద్యారంగ సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సోమవారం...
By Boya Dasthagiri 2026-07-13 10:17:03 0 129
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com