జరిగింది దురదృష్టకరమైన సంఘటన- ఎంఎల్ఏ.|

0
267

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్‌గిరి శాసనసభ్యులు  మర్రి రాజశేఖర్ రెడ్డి  సఫిల్ గూడ శ్రీ విజయ దుర్గ కట్ట మైసమ్మ దేవాలయం వద్ద ఇటీవల జరిగిన దుర్చర్యపై తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. ఇటువంటి అరాచక చర్యలు మళ్లీ పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులతో చర్చించామని తెలిపారు. ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా? లేక ఇతర దురుద్దేశంతో జరిగిందా? అన్న అంశాలపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని డీసీపీ శ్రీధర్ తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. 

ప్రజలందరూ ఈ సమయంలో సమన్వయంతో, ఐక్యతతో ముందుకు సాగాలని, భావోద్రేకాలకు లోనయ్యే సమయం కాదని ఎమ్మెల్యే  సూచించారు.

 దేవాలయాలు, ధార్మిక స్థలాలపై ఎలాంటి దాడులు లేదా దుర్చర్యలు జరిగితే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. ప్రజల శాంతి భద్రతలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం, పోలీస్ శాఖ తీసుకోవాలని ఆయన స్పష్టంగా తెలిపారు. ఇటువంటి ఘటనలు జరగడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు.

#sidhumaroju 

Search
Categories
Read More
Telangana
హెచ్‌సీఏలో ‘విశాఖ’ సెగ: రూ. 70 కోట్ల చెల్లింపులపై జింఖానాలో రచ్చ!
హైదరాబాద్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA)లో అవినీతి ఆరోపణలు మరోసారి ప్రకంపనలు...
By Sidhu Maroju 2026-03-03 13:56:18 0 250
Andhra Pradesh
ఎమ్మిగనూరు పట్టణంలోని బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులతో సమరాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి...
By Boya Dasthagiri 2026-04-05 13:50:16 0 275
Andhra Pradesh
మదనపల్లిలో భర్తపై ఇనుపరాడ్ తో భార్య దాడి.
శుక్రవారం మదనపల్లెలో కుటుంబ కలహం తీవ్రరూపం దాల్చింది. శ్రీవారి నగర్‌కు చెందిన రెడ్డి బాబు...
By Pagadala Venkateswar 2026-04-10 06:24:00 0 136
Andhra Pradesh
రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం గారు
*రాష్ట్రపతిని కలిసిన బ్రహ్మానందం*   టాలీవుడ్ హాస్య నటుడు బ్రహ్మానందం భారత రాష్ట్రపతి...
By Rajini Kumari 2025-12-22 07:57:33 0 261
Telangana
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్‌ కిట్లు పంపిణీ!
విద్యార్థులకు గుడ్‌న్యూస్.. 22 వస్తువులతో స్కూల్‌ కిట్లు పంపిణీ! తెలంగాణ : ప్రభుత్వ...
By Pinnehasan Odela 2026-01-15 14:27:00 0 258
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com