గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా ఉన్న రౌడీషీటర్స్ ను పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ లో భాగంగా నడి రోడ్డు లో మీద పేరెడ్ నిర్వహించారు.

0
613

 

>కేవీస్సార్. కోటేశ్వరరావు. గుంటూరు

 

 గుంటూరు జిల్లా పోలీస్... తేది : 10.01.2026 🚩 గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా రౌడీ షీటర్లకు నేరచరిత్ర కలిగిన వారికి పోలీస్ మార్క్ కౌన్సెలింగ్ నిర్వహించిన గుంటూరు జిల్లా పోలీసులు. 📍సాధారణ కౌన్సిలింగ్ గా భ్రమించి హాజరైన వారికి రౌడీ షీటర్లు నేరచరిత్ర కలిగిన వారికి పోలీస్ మార్క్ కౌన్సిలింగ్ రుచి చూపించిన గుంటూరు జిల్లా పోలీసులు. 📍 కౌన్సెలింగ్ అనంతరం, గుంటూరు నగరంలోని లక్ష్మిపురంలోని ఎన్టీఆర్ స్టేడియం నుంచి మదర్ తెరిసా విగ్రహం వరకు పరేడ్ నిర్వహించగా, "పోలీస్ మార్క్ కౌన్సెలింగ్" రౌడీ షీటర్ల లో కనపడింది. 🔅 ప్రజా శాంతికి భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని, ఎవరినీ ఉపేక్షించబోమని, చట్టానికి లోబడి నడుచుకోవాలని జిల్లా ఎస్పీ గారు హెచ్చరించారు. 🔅 మహిళలు, బాలికలపై అత్యాచారాలు, వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. 🔅 జిల్లాలో నేరాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వాటిని అరికట్టేందుకు పటిష్ఠమైన చర్యలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. 🔅 ప్రస్తుతం ప్రజలకు డయల్ 112 వంటి హెల్ప్‌లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయని, రౌడీయిజం లేదా శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలు జరిగితే నిమిషాల్లోనే పోలీసుల దృష్టికి చేరుతాయని తెలిపారు. 🔅 రౌడీ, KD, DCల కదలికలపై నిరంతర నిఘా కొనసాగుతోందని, అవసరమైతే PD యాక్ట్ వంటి కఠిన చట్టాలు అమలు చేస్తామని హెచ్చరించారు. 🔅 ప్రతి ఒక్కరూ చట్టాలకు లోబడి నడుచుకోవాలని, నేరాలకు పాల్పడి తమ జీవితాలను నాశనం చేసుకోకూడదని సూచించారు. 🔅 నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన ప్రణాళికలు రూపొందించామని, మారుమూల ప్రాంతాల్లో కూడా సీసీ కెమెరాల ఏర్పాటు, బీట్ విధానాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నామని తెలిపారు. 🔅 గతంలో నేరాలకు పాల్పడిన వ్యక్తులపై నిఘా పెంచామని, భవిష్యత్తులో చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. 🔅 కౌన్సెలింగ్ సమయంలో, సంబంధిత వ్యక్తులు ప్రస్తుతం జీవిస్తున్న విధానం, జీవనోపాధి కోసం చేస్తున్న వృత్తులపై పోలీసులు ఆరా తీశారు. 🔅 ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ, తమ ప్రాంతాల్లో ఎలాంటి అల్లర్లు, గొడవలు, అనుమానాస్పద ఘటనలు జరిగినా వెంటనే డయల్ 112 లేదా సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని సూచించారు. 🚔 జిల్లాను ప్రశాంత జిల్లాగా ఉంచడమే లక్ష్యంగా, శాంతి భద్రతల పరిరక్షణ కోసం గుంటూరు జిల్లా పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
“ప్రభాస్ అభిమానులకు భారీ గుడ్ న్యూస్! 💥 టాలీవుడ్‌లో ఎప్పటికీ గుర్తుండిపోయే లవ్ ఎంటర్టైనర్ Darling మళ్లీ థియేటర్లలోకి రానుంది.
ఈ నెల 23వ తేదీన ‘Darling’ మూవీ రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 😍 ఈ సినిమా...
By Thokala Sivaji 2026-04-08 11:23:02 0 413
Uttar Pradesh
Nautapa, Storms Claim Over 15 Lives; Fresh Severe Heat Alert Issued for Purvanchal
Severe weather has devastated regions, with the intense Nautapa heatwave and subsequent strong...
By Tejaswini Komanduru 2026-06-05 07:46:58 0 619
Telangana
నిజామాబాద్:డ్రాంకన్ డ్రైవ్ లో 22 మందికి జారిమాన
జిల్లా కేంద్రంలో మద్యం తాగిన 22 మందిని పట్టుకుని రాజకీయాలు వారిణి కోర్ట్ లో హజారు పరిచారు. విచారన...
By Sadaq Sadaq 2026-03-11 16:22:00 0 198
Andhra Pradesh
గిరిజన గ్రామాల్లో ST కమిషన్ చైర్మన్ పర్యటన...
కాకినాడ జిల్లా శంఖవరం మండలం పెదమల్లాపురంలో ఎస్టీ కమిషన్ చైర్మన్ "బొజ్జి రెడ్డి" గారు పర్యటించి...
By BABJI DADALA 2025-12-23 14:28:21 0 370
Telangana
నేడు జగిత్యాలకు KTR..
BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేడు జగిత్యాలకు రానున్నారు. మాజీ మంత్రులు గంగుల కమలాకర్ కొప్పుల...
By Sunka Santhosh 2026-04-09 05:42:23 0 218
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com