ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి....సీసీటీవీ కెమెరాల పనితీరును తప్పనిసరిగా పరిశీలించాలి

0
272

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలి....సీసీటీవీ కెమెరాల పనితీరును తప్పనిసరిగా పరిశీలించాలి

 

ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యం : పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

 

రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జోన్‌లకు చెందిన ప్రజలు పండుగలు, సెలవులు, వివాహాలు తదితర సందర్భాల్లో ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లే సమయంలో అప్రమత్తంగా ఉండాలని,చోరీలు మరియు ఇతర నేరాలు జరగకుండా స్వీయ రక్షణ చర్యలు తప్పనిసరిగా పాటించాలని పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఒక ప్రకటనలో సూచించారు.

 

ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే ముందు తలుపులు,కిటికీలు, గేట్లు సక్రమంగా మూసి ఉన్నాయా లేదా అన్న విషయాన్ని పూర్తిగా పరిశీలించుకోవాలని తెలిపారు.అలాగే ఇళ్లలో లేదా ఇంటి పరిసర ప్రాంతాల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు సరిగా పనిచేస్తున్నాయా, రికార్డింగ్ జరుగుతోందా,నైట్ విజన్ సదుపాయం సక్రమంగా ఉందా అనే అంశాలను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని సూచించారు.

 

సీసీటీవీ కెమెరాలు సక్రమంగా పనిచేస్తే నేరాలకు పాల్పడే వ్యక్తుల్లో భయాన్ని కలిగించడంతో పాటు,ఏదైనా అనుకోని ఘటన జరిగినా నిందితులను గుర్తించేందుకు ఎంతో ఉపయోగపడుతాయని సీపీ పేర్కొన్నారు. ఇంటర్నెట్ సదుపాయం కలిగిన సీసీటీవీ కెమెరాలైతే మొబైల్ ఫోన్ యాప్ ద్వారా లైవ్ ఫుటేజ్ వీక్షించే విధంగా ముందుగానే సెటప్ చేసుకోవాలని సూచించారు.

 

అదేవిధంగా,ఇళ్లకు తాళాలు వేసి వెళ్లే విషయాన్ని పొరుగువారికి లేదా నమ్మకమైన వ్యక్తికి ముందుగా తెలియజేయడం, అవసరమైతే సంప్రదింపు ఫోన్ నంబర్ ఇవ్వడం భద్రతకు మరింత దోహదపడుతుందని తెలిపారు.రాత్రి సమయాల్లో ఇంటి వెలుపల లైట్లు వెలిగేలా టైమర్ ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇల్లు ఖాళీగా ఉందనే అనుమానం కలగకుండా ఉంటుందని వివరించారు.

 

ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు లేదా కదలికలు గమనించినట్లయితే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని,లేదా డయల్ 100 లేదా 112కు ఫోన్ చేయాలని పోలీస్ కమిషనర్ ప్రజలను కోరారు.ప్రజల సహకారంతోనే నేరాల నివారణ సాధ్యమవుతుందని, ప్రతి పౌరుడు భద్రత విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు.

Search
Categories
Read More
Telangana
శ్రీ గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం నూతన కార్యవర్గం ఎంపిక.|
     మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : కుత్బుల్లాపూర్  శ్రీ గాయత్రి బ్రాహ్మణ...
By Sidhu Maroju 2025-12-17 14:52:09 0 287
Andhra Pradesh
మేడారం సమ్మక్క సారక్కను దర్శించుకున్న కేశినేని నాని గారు
*మేడారం సమ్మక్క–సారక్క గద్దెను దర్శించుకున్న కేశినేని నాని గారు*   * ములుగు జిల్లా...
By Rajini Kumari 2026-01-13 15:44:10 0 230
Telangana
మంచిర్యాల్ లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి
మంచిర్యాల్ జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో డాక్టర్ల నిర్లక్ష్యం: వ్యక్తి మృతి,...
By Pinnehasan Odela 2026-01-14 17:58:26 0 240
SURAKSHA
Manish Kumar Gupta, IAS: Steering Arunachal Toward Progress
Introduction: A Leader Driving Administrative Excellence "Good governance is not merely about...
By Fathima Safa 2026-07-21 12:58:10 0 98
Bharat
👉 వైద్య, ఆరోగ్యశాఖలో 60 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
👉కృష్ణా జిల్లాలోని యూపీహెచ్సీ,పీహెచ్సీల్లో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ పద్ధతిలో 60 పోస్టుల భర్తీకి...
By SivaNagendra Annapareddy 2025-12-23 07:56:19 0 334
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com