సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి:: డిఐజీ కర్నూల్ ఇన్చార్జి ఎస్పి

0
250

కర్నూలు :
కర్నూలు జిల్లా...

 సంక్రాంతి పండగ ఆఫర్లు అంటూ సైబర్ మోసాలు...

ఫేక్ షాపింగ్ ల ఆఫర్లు, పండుగ డిస్కౌంట్ల పేరుతో మోసాలు

సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా  ఉండాలి

...డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు. 

సంక్రాంతి పండుగ సమీపిస్తున్న నేపథ్యంలో ఆన్‌లైన్ షాపింగ్, రీచార్జ్ లు, ట్రావెల్ బుకింగ్‌లు ,  “భారీ డిస్కౌంట్”, “లిమిటెడ్ టైం ఆఫర్”, “సంక్రాంతి స్పెషల్ గిఫ్ట్” ఫేక్ షాపింగ్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్, నకిలీ వెబ్ సైట్ల ద్వారా భారీ తగ్గింపు అని చూపించి మోసం చేస్తారని  ఇలా ఆఫర్ల పేరుతో ఆకర్షణీయమైన సందేశాలతో ప్రజలను మభ్యపెడుతూ  సైబర్ నేరగాళ్లు మోసం చేసే ప్రయత్నం చేస్తారని, కాబట్టి జాగ్రత్తగా ఉండాలని , సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని  డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఒక ప్రకటనలో తెలియచేశారు

నకిలీ వెబ్‌సైట్లు, ఫేక్ షాపింగ్ యాప్‌లు, ఫిషింగ్ లింకులు, సోషల్ మీడియా ప్రకటనలు, WhatsApp మరియు SMSల ద్వారా వ్యక్తిగత వివరాలు, బ్యాంక్ సమాచారం, OTPల ను పొందేందుకు ప్రయత్నిస్తుంటారన్నారు. 

 చెల్లింపుల కోసం నకిలీ యాప్‌లు, క్యూఆర్ కోడ్‌లను కూడా  ఉపయోగిస్తుంటారన్నారు. 

కొంతమంది మోసగాళ్లు ముందుగా తక్కువ ధర చూపించి చెల్లింపు చేసిన తర్వాత పూర్తిగా కనుమరుగవుతుంటారన్నారు.

ప్రత్యేకంగా ఆన్‌లైన్ లక్కీ డ్రా కూపన్లు, ఉచిత బహుమతుల పేరుతో లింకులు పంపి మొబైల్‌లో మాల్వేర్ ఇన్‌స్టాల్ అయ్యేలా చేసి డేటా దోపిడీ చేస్తుంటారన్నారు.

 దీని వల్ల ఖాతాల నుంచి డబ్బు మాయం కావడం, సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ కావడం వంటి సమస్యలు ఎదురవుతుంటాయన్నారు. 

జిల్లా ఎస్పీ గారు జిల్లా ప్రజలకు పలు సూచనలు చేశారు. 

 ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

* తెలియని ఆఫర్ లింకుల పై క్లిక్ చేయవద్దు.

* అనధికారిక వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా కొనుగోళ్లు చేయవద్దు.

* OTPలు, CVV, బ్యాంక్ వివరాలు ఎవరికీ ఇవ్వవద్దు.

* అధికారిక షాపింగ్ యాప్‌లు/వెబ్‌సైట్లను మాత్రమే ఉపయోగించండి.

* సోషల్ మీడియాలో కనిపించే అతిగా తక్కువ ధరల ఆఫర్లను నమ్మవద్దు.

సైబర్ మోసాలకు గురైన వారు వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ నంబర్ 1930 కు ఫోన్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలి.

సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలంటే సైబర్ మోసాల పట్ల అప్రమత్తత అత్యవసరమని, జాగ్రత్తే భద్రత అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని డిఐజి, కర్నూలు జిల్లా ఇన్ చార్జ్ ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు ఒక ప్రకటన లో తెలియచేశారు.

Search
Categories
Read More
Telangana
Andhra Pradesh ex speaker duddilla sri pada rao 27th death anniversary
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు గారి 27వ వర్థంతి సందర్భంగా...
By G k Nookala 2026-04-13 13:02:36 0 362
Telangana
రిచ్ మాక్స్ గోల్డెన్ బ్రాంచ్ ప్రారంభం.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా :  అల్వాల్లో ప్రారంభమైన ప్రముఖ గోల్డ్ లోన్ కంపెనీ రిచ్ మాక్స్...
By Sidhu Maroju 2025-08-30 14:26:19 0 395
Andhra Pradesh
మదనపల్లి: రైతులకు లాభమే లక్ష్యం - ఏఎంసీ ఛైర్మన్.
మదనపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ జంగాల శివరాం, సెక్రటరీ జగదీష్‌తో కలిసి మార్కెట్ యార్డును...
By Pagadala Venkateswar 2026-03-03 04:04:08 0 164
Bihar
Bihar C M nitesh kumar resigned
🟥 బీహార్‌లో రాజకీయ సంచలనం… సీఎం పదవికి నితీష్ కుమార్ రాజీనామా బీహార్ రాజకీయాల్లో...
By G k Nookala 2026-04-14 10:25:54 0 161
Telangana
Pipri in adilabad public meeting
ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు...
By G k Nookala 2026-04-06 10:08:08 0 183
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com