విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్య జ్యోతి

0
218

*విద్యార్థుల భవిష్యత్తుకు బాట వేసిన విద్యాజ్యోతి*

 

*విద్యాజ్యోతి ద్వారా విద్యార్థుల జీవితాల్లో వెలుగులు*

 

*మంత్రి నారా లోకేష్ సంస్కరణలతో విద్యార్థుల జీవితాల్లో వెలుగు*

 

*మంత్రి నారా లోకేష్ విజన్‌తో రాష్ట్ర విద్యకు పునర్జీవనం*

 

*మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్*

 

విద్యే వెలుగుగా భావించి విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన విద్యాజ్యోతి కార్యక్రమం గ్రామీణ ప్రాంతాల్లో చదువుకు కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ఆర్థిక ఇబ్బందులతో వెనుకబడుతున్న విద్యార్థులకు పుస్తకాలు, విద్యా సామగ్రి అందిస్తూ, విద్యారంగంలో సమాన అవకాశాలు కల్పించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యంగా నిలుస్తుందని మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ అన్నారు. శుక్రవారం మంగళగిరి మండలం పెద్దవడ్లపూడి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా జ్యోతి కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు పుస్తకాల పంపిణీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ జవ్వాది కిరణ్ చంద్ మాట్లాడుతూ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వంతో పాటు ప్రజాప్రతినిధుల ప్రధాన లక్ష్యమని తెలిపారు.మంత్రి నారా లోకేష్ విద్యారంగంలో ప్రవేశపెట్టిన నూతన సంస్కరణల వల్ల రాష్ట్రంలోని విద్యాసంస్థల్లో గుణాత్మక మార్పులు చోటుచేసుకుంటున్నాయని జవ్వాది కిరణ్ చంద్ అన్నారు. ఈ సంస్కరణల ద్వారా విద్యార్థులకు మెరుగైన బోధనతో పాటు ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసే విధంగా పాఠ్యపద్ధతులు రూపొందించబడుతున్నాయని, దాని ఫలితంగా వారి భవిష్యత్తు మరింత ఉన్నతంగా తీర్చిదిద్దబడుతుందని తెలిపారు.విద్యే సమాజాభివృద్ధికి పునాది అని పేర్కొన్న ఆయన, పుస్తకాలు విద్యార్థుల జీవిత దిశను మలిచే శక్తివంతమైన సాధనాలుగా మారుతాయని అన్నారు. విద్యాజ్యోతి వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో చదువుపట్ల ఆసక్తిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని స్పష్టం చేశారు.

గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు లభిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో గ్రామ పార్టీ అధ్యక్షులు యేళ్ళ శివరామయ్య, మాదల రమేష్ బాబు, కనపాల సాగర్, కఠారి మురళి, కొడవలి ఆనంద్,జాలాది సందీప్, పిడుగు రవి, కాకర్లముడి సారంగపాణి, గుడిమెట్ల ఎల్లయ్య, కటారి సాంబయ్య,పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు, విద్యార్థులు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
విశాఖ నగర ప్రజలకు పోలీస్ వారి ముఖ్య గమనిక
By Bharat Aawaz 2025-05-28 14:43:50 0 2K
Andhra Pradesh
ఇబ్రహీంపట్నంలో వరుస బైకుల దొంగతనాలు
ఇబ్రహీంపట్నం లో వరుస ద్విచక్ర వాహనాల దొంగతనాలు.....   పోలీసులకే తలనొప్పిగా మారిన దొంగల...
By Rajini Kumari 2026-01-16 12:54:57 0 241
Andhra Pradesh
అన్నమయ్య: దొంగతనానికి వచ్చి.. కెమెరాలకు చిక్కారు.
శనివారం రాత్రి రాజంపేట మండలం వెంకట రాజంపేటలోని కనకదుర్గమ్మ గుడిలో ఇద్దరు దొంగలు హుండీని బద్దలు...
By Pagadala Venkateswar 2026-05-25 04:20:46 0 129
Andhra Pradesh
Nara Lokesh: క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన.
అమరావతిలో ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు కానున్న క్వాంటం వ్యాలీ ఎలాంటి ఉన్నత స్థాయి ఉద్యోగ అవకాశాలను...
By Pagadala Venkateswar 2026-02-08 11:20:53 0 204
Andhra Pradesh
డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం
తాడేపల్లి    ప్రతి సంవత్సరం డిసెంబర్ 24వ తేదీన జాతీయ వినియోగదారుల హక్కుల దినోత్సవం...
By Rajini Kumari 2025-12-18 11:16:50 0 267
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com